Site icon HashtagU Telugu

Ranveer Singh : ‘హనుమాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మతో రణ్‌వీర్ సింగ్ సినిమా.. నిజమేనా..?

Ranveer Singh Next With Hanuman Director Prasanth Varma

Ranveer Singh Next With Hanuman Director Prasanth Varma

Ranveer Singh : బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో ఓ సినిమా చేయడానికి సిద్దమవుతున్నారట. ‘హనుమాన్’ సినిమాతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మొదటిసారిగా ఓ సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ కి తెరలేపిన దర్శకుడు ప్రశాంత్ వర్మ.. నెక్స్ట్ స్టెప్ ఏంటని ప్రతి ఒక్కరు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ లో మొత్తం 12 సినిమాలు రాబోతున్నాయని చెప్పుకొచ్చారు.

దీంతో ఆ యూనివర్స్ లో రాబోయే సినిమాలు పై ఆడియన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది. కాగా ప్రశాంత్ వర్మ హనుమాన్ రిలీజ్ కి ముందే ‘అధీర’ అనే మరో సూపర్ హీరో మూవీ స్టార్ట్ చేసారు. ఈ సినిమాలో నిర్మాత డివివి దానయ్య వారసుడు హీరోగా నటిస్తున్నారు. అయితే హనుమాన్ రిలీజైన తరువాత ఆడియన్స్ లో ‘జై హనుమాన్’ పై భారీ హైప్ క్రియేట్ అవ్వడంతో.. ప్రశాంత్ వర్మ ఆ సీక్వెల్ ప్రీ ప్రొడక్షన్ పై ఫోకస్ పెట్టారు. దీంతో అధీర సినిమా సంగతి అసలు ఊసే లేదు. అయితే ఇటీవల హనుమాన్ 100 డేస్ ఫంక్షన్ లో ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ తో పాటు అధీర మూవీ షూటింగ్ కూడా జరుగుతున్నట్లు వెల్లడించారు.

అలాగే రానున్న 20ఏళ్లలో ఈ సూపర్ హీరో మూవీస్ లో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అన్ని పరిశ్రమకు చెందిన హీరోలు కనిపిస్తారని చెప్పుకొచ్చారు. ఈక్రమంలోనే ఓ సూపర్ హీరో మూవీ కోసం బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ ని మైత్రి మూవీ మేకర్స్ సెట్ చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా జై హనుమాన్ కంటే ముందుగానే ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉందట. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు గాని, ప్రస్తుతం ఈ న్యూస్ అయితే అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది.

Also read : Shahid Kapoor : హిట్ కోసం సౌత్ డైరెక్టర్స్ వైపు బాలీవుడ్ హీరోలు.. వంశీ పైడిపల్లితో షాహిద్..