Site icon HashtagU Telugu

Thalaivar 171 : రజినీకి షారుఖ్ నో.. రణ్‌వీర్‌ అయినా ఓకే చెబుతాడా..!

Ranveer Singh For Lokesh Kanagaraj Rajinikanth Thalaivar 171 Movie

Ranveer Singh For Lokesh Kanagaraj Rajinikanth Thalaivar 171 Movie

Thalaivar 171 : తలైవర్ అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న సినిమా లోకేష్ కనగరాజ్ తో చేయబోయే 171వ సినిమా. విక్రమ్ సినిమాతో కమల్ హాసన్ ని లోకేష్ ఏ రేంజ్ లో ఎలివేట్ చేసారో అందరికి తెలిసిందే. దీంతో అలాంటి ఓ సినిమాని రజినీతో కూడా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక ఇటీవల ఈ మూవీ నుంచి తలైవర్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసి.. ఫ్యాన్స్ కి వింటేజ్ రజినీని గుర్తు చేసారు లోకేష్. దీంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఆ అంచనాలకు రీచ్ అయ్యేలా లోకేష్ సినిమాలోని పాత్రలను, ఆ పాత్రలకు తగ్గ నటులను ఎంచుకుంటూ వస్తున్నారు. ఈక్రమంలోనే మూవీలోని ఓ ముఖ్య పాత్రని.. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ చేయించాలని లోకేష్ భావించారు. ఈ విషయానే షారుఖ్ దృష్టికి కూడా తీసుకువెళ్లి.. ఆ పాత్ర గురించి కూడా చెప్పారట. అయితే షారుఖ్ ఆ పాత్ర చేయడానికి సున్నితంగా నో చెప్పారట. దీంతో లోకేష్ ఆ పాత్రని రణ్‌వీర్‌ సింగ్‌తో చేయించాలని ఆలోచిస్తున్నారట.

ఈక్రమంలోనే రణ్‌వీర్‌ని కలిసి కథ వినిపించడం కోసం సంప్రదింపులు చేస్తున్నారట. మరి షారుఖ్ నో చెప్పిన పాత్రకి రణ్‌వీర్‌ ఓకే చెబుతారా లేదా అనేది చూడాలి. కాగా ఈ సినిమా టైటిల్ ని ఏప్రిల్ 22న అనౌన్స్ చేస్తామంటూ ఇటీవలే లోకేష్ అనౌన్స్ చేసారు. మూవీలోని రజిని లుక్ ని మాస్ గా డిజైన్ చేసి ఆకట్టుకున్న లోకేష్ కనగరాజ్.. సినిమాకి ఎలాంటి మాస్ టైటిల్ ని ఫిక్స్ చేస్తారో అని ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకుంది.

సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి లోకేష్ కనగరాజ్ సంగీతం అందించబోతున్నారు. ప్రస్తుతం రజిని ‘వెట్టియాన్’ సినిమాలో బిజీగా ఉన్నారు. TJ జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకున్నట్లు సమాచారం. ఈ మూవీ షూటింగ్ పూర్తి అవ్వగానే లోకేష్ సినిమా షూటింగ్ పట్టాలు ఎక్కించనున్నారట.

Also read : Ranbir Kapoor : రణ్‌బీర్ రామాయణం కోసం.. సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ మ్యూజిక్ డైరెక్టర్..