RC16 : రంగస్థలం జరిగిన చోటే చరణ్ తో బుచ్చి బాబు సినిమా.. మెగా అప్డేట్ అదుర్స్..!

RC16 గేమ్ చేంజర్ తర్వాత రాం చరణ్ బుచ్చి బాహు డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు.

Published By: HashtagU Telugu Desk
Ram Charan Rejected Kollywood Director Picked that Movie

Ram Charan Rejected Kollywood Director Picked that Movie

RC16 గేమ్ చేంజర్ తర్వాత రాం చరణ్ బుచ్చి బాహు డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు. ఉప్పెన సినిమాతో తొలి ప్రాజెక్ట్ తోనే బంపర్ హిట్ అందుకున్న బుచ్చి బాబు తన సెకండ్ అటెంప్ట్ భారీ రేంజ్ లో చేస్తున్నాడు. ఈ సినిమా పీరియాడికల్ కథతో వస్తుందని తెలుస్తుంది. మార్చి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని తెల్సుతుంది. అయితే ఈ సినిమా రంగస్థలం షూటింగ్ జరిగిన సెట్ లోనే ప్లాన్ చేస్తున్నారట.

We’re now on WhatsApp : Click to Join

రంగస్థలం సెట్స్ లోనే బుచ్చి బాబు రాం చరణ్ సినిమా సెట్స్ వేస్తున్నట్టు తెలుస్తుంది. రంగస్థలం తరహాలోనే ఈ సినిమా కథ కూడా పీరియాడికల్ గా సాగుతుందని టాక్. గురువు సుకుమార్ పంథాలోనే రాం చరణ్ తో రంగస్థలం ని మించే సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు బుచ్చి బాబు. ఈ సినిమా మిగతా కాస్టింగ్ ఎవరన్నది తెలియాల్సి ఉంది.

సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అయితే కన్ ఫర్మ్ అవ్వగా మిగతా టెక్నిషియన్స్ కూడా ఎవరన్నది తెలియాల్సి ఉంది. బుచ్చి బాబు ఈ సినిమాను చాలా పెద్ద ప్లానింగ్ తో తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. సినిమాలో చరణ్ లుక్ క్యారెక్టరైజేషన్ కూడా డిఫరెంట్ గా ఉంటాయని టాక్. రంగస్థలం రిఫరెన్స్ తోనే బుచ్చి బాబు చరణ్ 16 సినిమా ఉంటుందని తెలుస్తుండగా ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

Also Read : Devara Interval Scene : దేవర ఇంటర్వెల్ సీట్లు చిరిగిపోవాల్సిందేనా.. ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ కి పండుగే..!

  Last Updated: 24 Jan 2024, 06:50 PM IST