Ranbir Remuneration : యానిమల్ రన్ బీర్ రెమ్యునరేషన్ ప్లస్ ప్రాఫిట్స్ లో వాటా..!

Ranbir Remuneration సందీప్ వంగ డైరెక్షన్ లో రణ్ బీర్ కపూర్ హీరోగా వచ్చిన సినిమా యానిమల్. టీ సీరీస్ నిర్మాణంలో భూషణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాలో

Published By: HashtagU Telugu Desk
Ranbir Remuneration For Animal Movie

Ranbir Remuneration For Animal Movie

Ranbir Remuneration సందీప్ వంగ డైరెక్షన్ లో రణ్ బీర్ కపూర్ హీరోగా వచ్చిన సినిమా యానిమల్. టీ సీరీస్ నిర్మాణంలో భూషణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. రణ్ విజయ్ సింగ్ పాత్రలో రణ్ బీర్ నటన అదుర్స్ అని చెప్పొచ్చు. సినిమా మొత్తం వన్ మ్యాన్ షో చేసి సర్ ప్రైజ్ చేశాడు.

యానిమల్ సినిమా కోసం ఇంత కష్టపడిన రణ్ బీర్ కపూర్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుంది. మామూలుగా అయితే సినిమాకు 70 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకునే రణ్ బీర్ యానిమల్ సినిమాకు మాత్రం చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారట. తన రెమ్యునరేషన్ లో సగం మాత్రమే తీసుకుని మిగతాది ప్రాఫిట్స్ లో షేర్ తీసుకుంటానని అగ్రిమెంట్ చేసుకున్నాడట.

సో అలా చూస్తే రణ్ బీర్ కి యానిమల్ భారీ లాభాలు తెచ్చే అవకాశం కనిపిస్తుంది. యానిమల్ సినిమాకు 200 కోట్ల దాకా బడ్జెట్ పెట్టినట్టు తెలుస్తుంది. సినిమాకు మంచి టాక్ రావడంతో వీకెండ్ లోనే వసూళ్ల మోత మోగించింది. యానిమల్ సినిమా రణ్ బీర్ ఖాతాలో ఒక సెన్సేషనల్ హిట్ గా నిలుస్తుంది. సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించగా ఆమెకు 4 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఇచ్చారట. ఇక మరోపక్క అనీల్ కపూర్ కి 2, బాబీ డియోల్ 2 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

Also Read : Mega 156 : అనుష్క కోసం 5 కోట్లా..?

We’re now on WhatsApp : Click to Join

  Last Updated: 04 Dec 2023, 01:44 PM IST