Ranbir Kapoor: బీబీసీ జర్నలిస్టుకు ఊహించని ఝలక్ ఇచ్చిన రణ్‌బీర్ కపూర్‌

‘బ్రహ్మాస్త్ర’తో గొప్ప విజయాన్ని అందుకున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) తదుపరి చిత్రం ‘‘తూ ఝూటీ మే మక్కార్’’ త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా రణ్‌బీర్ కపూర్‌ పాల్గొన్న ఓ మీడియా సమావేశంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

Published By: HashtagU Telugu Desk
123

Resizeimagesize (1280 X 720) (3) 11zon

‘బ్రహ్మాస్త్ర’తో గొప్ప విజయాన్ని అందుకున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) తదుపరి చిత్రం ‘‘తూ ఝూటీ మే మక్కార్’’ త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా రణ్‌బీర్ కపూర్‌ పాల్గొన్న ఓ మీడియా సమావేశంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ సమావేశానికి వచ్చిన బీబీసీ జర్నలిస్టుకు ఆయన ఊహించని ఝలక్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ‘‘బాలీవుడ్ సినిమాలు వసూళ్ల పరంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి కదా?’’ అంటూ ఆ బీబీసీ జర్నలిస్టు తన తొలి ప్రశ్న సంధించారు. దీంతో రణ్‌బీర్ అందుకుని ‘‘అదేంటండీ అలా అంటారు? పఠాన్ సినిమా కలెక్షన్ల గురించి మీకు తెలియదా?’’ అని ఎదురు ప్రశ్న వేశారు.

Also Read: Aamani: నటి ఆమని సంచలన వ్యాఖ్యలు.. డబ్బు కోసం సినిమాల్లోకి రాలేదు

దీంతో.. ఆ జర్నలిస్టు మరో ప్రశ్న వేయబోతుండగా రణ్‌బీర్ మళ్లీ కల్పించుకున్నారు. ‘‘ముందు మీరు అసలు ఏ పబ్లికేషన్‌ నుంచి వచ్చారో చెప్పండి. ఇప్పుడు మీ కంపెనీ టైం బాలేనట్టు ఉందిగా. ముందు దాని గురించి చెప్పండి’’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్న వారందరూ గొల్లున నవ్వారు. బీబీసీ వార్తా సంస్థ పన్ను ఎగవేసిందన్న ఆరోపణలపై ఐటీ అధికారులు ఇటీవల సంస్థకు చెందిన ఢిల్లీ, ముంబై కార్యాలయాల్లో ట్యాక్స్ సర్వే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక ‘తూ ఝూటా మే మక్కార్’ సినిమాలో రణ్‌బీర్‌కు జోడీగా శ్రద్ధా కపూర్ నటిస్తోంది. లవ్ రంజన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో డింపుల్ కపాడియా, బోనీ కపూర్, అనుభవ్ సింగ్ బస్సీ, రాజేశ్ జాయిస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా మార్చి 8న విడుదల కానుంది.

  Last Updated: 23 Feb 2023, 03:27 PM IST