Ranbir Kapoor : రణబీర్ మంచి భర్త కాదంట.. అలియా భట్‌తో మ్యారేజిపై రణబీర్ ఏం చెప్పాడో తెలుసా??

పెళ్లయిన కొన్నాళ్లకే అలియా భట్ తాను తల్లి అని ప్రకటించడం, ఇటీవలే కూతురు పుట్టడం, ఆ కూతురికి రాహా అని పేరు పెట్టడం.. ఇలా గత కొన్నాళ్లుగా రణబీర్, అలియా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.

Published By: HashtagU Telugu Desk
Ranbir Kapoor comments on his marriage life

Ranbir Kapoor comments on his marriage life

బాలీవుడ్(Bollywood) స్టార్ కపుల్ రణబీర్ కపూర్(Ranbir Kapoor) – అలియా భట్(Alia Bhatt) కొన్నాళ్ల పాటు ప్రేమించుకొని గతేడాది పెళ్లి చేసుకున్నారు. ఈ జంట పెళ్లి చేసుకోవడంతో క్యూట్ కపుల్ అంటూ అభిమానులు, నెటిజన్లు అభినందించారు. ఇక పెళ్లయిన కొన్నాళ్లకే అలియా భట్ తాను తల్లి అని ప్రకటించడం, ఇటీవలే కూతురు పుట్టడం, ఆ కూతురికి రాహా(Raha) అని పేరు పెట్టడం.. ఇలా గత కొన్నాళ్లుగా రణబీర్, అలియా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.

ఇటీవల రణబీర్, అలియా తమ మొదటి వివాహ వార్షికోత్సవం కూడా ఘనంగా చేసుకున్నారు. తాజాగా రణబీర్ కపూర్ ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా ఇందులో తన భార్య అలియా గురించి, కూతురు రాహా గురించి మాట్లాడాడు. తన కూతురు రాహా గురించి రణబీర్ మాట్లాడుతూ.. తను పుట్టిన తర్వాత న నాజీవితం మారిపోయింది. నేను కూడా చాలా మారాను. పిల్లల్ని ఎలా పెంచాలి అని నేర్చుకుంటున్నాను. నా కూతురు నన్ను మార్చేసింది, తనతో ఉంటే సమయమే తెలియదు అని అన్నాడు.

ఇక తన భార్య అలియా భట్ గురించి, తన గురించి మాట్లాడుతూ.. అలియా భార్యగా, తల్లిగా మంచి పాత్ర పోషిస్తుంది. భార్యగా కంటే కూడా ఒక గొప్ప తల్లిగా ఉంటుంది. కానీ నేను మాత్రం మంచి భర్తను కాను. ప్రస్తుతం నేను తండ్రి, కొడుకు, భర్త, బయట హీరో.. ఇలా అనేక రకాల పాత్రలను పోషిస్తున్నాను. వీటిలో భర్త పాత్రకు మాత్రం పూర్తిగా ఇంకా న్యాయం చేయలేదనిపిస్తుంది. కచ్చితంగా నేను మంచి భర్తని అయితే కాదు అని అన్నాడు. దీంతో రణబీర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారగా రణబీర్ మంచి భర్త కాదా అని అలియాని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.

 

Also Read :   Anjali: సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న హీరోయిన్ అంజలి మెహందీ ఫొటోస్.?

  Last Updated: 16 Apr 2023, 06:06 PM IST