Ranbir Kapoor Animal యూత్ ఆడియన్స్ కి దగ్గరైతే సినిమా సక్సెస్ అయినట్టే. అందుకే ఈమధ్య ప్రమోషన్స్ కూడా వారిని బేస్ చేసుకుని చేస్తున్నారు. ముఖ్యంగా మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ లో ఈమధ్య రెగ్యులర్ ప్రమోషనల్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. మల్లారెడ్డి కాలేజ్ లో సాంగ్ రిలీజ్ ఈవెంట్స్, ప్రమోషనల్ ఈవెంట్స్ సినిమాలకు కలిసి వస్తున్నాయి. అందుకే ప్రమోషన్స్ కోసం అక్కడకి వెళ్తున్నారు. తెలుగు సినిమాలే కాదు బాలీవుడ్ సినిమాలు కూడా మల్లా రెడ్డి కాలేజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు.
సందీప్ వంగ డైరెక్షన్ లో రణ్ బీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమా ప్రమోషన్స్ మల్లా రెడ్డి కాలేజ్ లో జరుగనున్నాయి. అక్కడ ఒక గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేశారు మేకర్స్. ఈ ఈవెంట్ లో రణ్ బీర్ కపూర్ రష్మిక తో పాటు చిత్రయూనిట్ పాల్గొంటారని తెలుస్తుంది. టాలీవుడ్ ఈవెంట్స్ లో ఇప్పుడు మల్లా రెడ్డి కాలేజ్ కూడా ఒక భాగమైంది.
Also Read : Trisha : త్రిష మరో లక్కీ ఛాన్స్.. ఏకంగా ఆ క్రేజీ కాంబోలో..!
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాల తర్వాత సందీప్ చేసిన ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. తండ్రి కొడుకుల మధ్య జరిగే ఎమోషనల్ కథతో యానిమల్ తెరకెక్కింది. ఈ సినిమా ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది.
హిందీతో పాటు తెలుగులో కూడా ఈ సినిమాను భారీ రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు. దిల్ రాజు ఈ సినిమాను తెలుగు రిలీజ్ చేస్తున్నారు. మరి అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ చేసిన ఈ యానిమల్ తెలుగు ఆడియన్స్ కు ఏమేరకు రీచ్ అవుతుందో చూడాలి.
We’re now on WhatsApp : Click to Join