Site icon HashtagU Telugu

Ramayan: బాలీవుడ్ రామాయణం మూవీపై ఎన్నో సందేహాలు.. క్లారిటీ వచ్చేది ఎప్పుడో!

Mixcollage 22 Mar 2024 08 59 Am 3288

Mixcollage 22 Mar 2024 08 59 Am 3288

ఇటీవల కాలంలో భారతదేశం పరిశ్రమలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో రామాయణం కూడా ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ దర్శకత్వం వహించనున్న ఈ భారీ ప్రాజెక్ట్ పై తరచూ రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి నటించనున్నట్లు ముందు నుంచి ప్రచారం నడుస్తుంది. అలాగే రావణుడిగా యశ్, ఆంజనేయుడిగా సన్నీ డియోల్, శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనుందని టాక్ వినిపించింది.

అయితే ఈ విషయాలపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. మరోవైపు ఈ ప్రాజెక్ట్ పై రూమర్స్ మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే వీరందరికీ లుక్ టెస్ట్ కంప్లీట్ అయ్యిందున అలాగే బాలీవుడ్ స్టార్స్ జాన్వీ కపూర్, లరా దత్తా మిగతా నటీనటులు సైతం కీలకపాత్రలలో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. వీటితోపాటు ఈ సినిమాపై ఇంకా ఎన్నో రకాల రూమర్స్ కూడా వినిపించాయి. కానీ ఇప్పటివరకు ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. అయితే ఈ ప్రాజెక్టుపై ఎవరు నోరు మెదపకపోవడంతో ఈ ప్రాజెక్టు నిజంగానే ఉంటుందా లేకపోతే ఫ్రీగా అన్న సందేహాలు మొదలవుతున్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ గురించి మరో న్యూస్ బయటకు వచ్చింది. నివేదికల ప్రకారం, దర్శకుడు నితీష్ తివారీ ఈ చిత్రాన్ని మూడు భాగాలుగా రూపొందిస్తారని తెలుస్తోంది. ఫస్ట్ పార్ట్ కేవలం రణబీర్ కపూర్, సాయి పల్లవి చుట్టూ మాత్రమే తిరుగుతుందట. ఈ స్టోరీ సీత అపహరణతో ముగుస్తుంది. ఇందులో హనుమంతుడు, రావణుడి పాత్రలు ఎక్కువగా కనిపించవు. ఏప్రిల్‌, మే నెలల్లో ప్రారంభమై 2 నెలల పాటు షూటింగ్‌ జరుపుకోనుందని.. రావణుడి పాత్రలో కనిపించబోతున్న యష్ ఈ సినిమాకు 15 రోజుల పాటు షూట్ చేయబోతున్నాడని, ఈ ఏడాది జూన్ లేదా జూలై నెలలో ఈ సినిమా షూటింగ్ జరగనుందని యష్ గురించి వార్తలు వచ్చాయి. రామాయణం పాత్రల కాస్ట్యూమ్స్‌పై చిత్ర నిర్మాతలు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే  తాజాగా ఈ సినిమపై మరో న్యూస్ వైరలవుతుంది. చిత్ర నిర్మాతల మధ్య పరస్పర విబేధాల కారణంగా రామాయణం ఈ సినిమా చిత్రీకరణకు మరిన్ని రోజులు సమయం పడుతుందట. చిత్ర నిర్మాతలు పరస్పర సమస్యలను పరిష్కరించుకున్న తర్వాతే ‘రామాయణం’ ప్రారంభిస్తారట. ఈ సినిమా షూటింగ్ పనులు మరికొన్ని రోజులు వాయిదా పడనున్నాయని తెలుస్తోంది.