Site icon HashtagU Telugu

Rashmika Movie: రష్మిక, రణ్ బీర్ .. ANIMAL.. వీడియో వైరల్ !!

Animal Imresizer

Animal Imresizer

ఇటీవల హీరోయిన్ ఆలియా భట్ ను పెళ్లాడిన రణ్ బీర్ కపూర్ .. మనాలీ కి వెళ్లారు. హనీమూన్ కు కాదండోయ్!! సినిమా షూటింగ్ కోసం !! ఔను.. పెళ్లయ్యాక హనీమూన్ ను వాయిదా వేసుకొని మరీ ఆయన షూటింగ్ లలో బిజీ అయ్యారు. రణ్ బీర్ కపూర్ హీరో గా నటిస్తున్న ‘ANIMAL’ సినిమా షూటింగ్ హిమాచల్ ప్రదేశ్ లోని మనాలీ లో జరుగుతోంది. ఈ మూవీలో హీరోయిన్ గా రష్మీక మందన నటిస్తున్నారు. తెల్ల కుర్తా లో రణ్ బీర్ కపూర్ , రెడ్ అండ్ వైట్ సారీలో రష్మీక మందన మధ్య సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న వీడియోను.. అటువైపుగా వెళ్తున్నా ఒక అభిమాని తన ఫోన్ లో తీశాడు. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది.

రష్మిక కు ఛాన్స్ ఎలా వచ్చిందంటే..

వాస్తవానికి ఈ సినిమాకు హీరోయిన్ గా తొలుత పరిణీతి చోప్రా ను ఎంపిక చేశారు. అయితే ఇంతియాజ్ అలీ తీస్తున్న ‘చమ్కీలా’ మూవీ లో నటిస్తున్నందున తాను సమయాన్ని కేటాయించలేనని ఆమె చెప్పారు. దీంతో చిత్ర నిర్మాతలు రష్మీక మందన కు అవకాశం ఇచ్చారు. ప్రణయ్ రెడ్డి వంగ (భద్రకాళి పిక్చర్స్) , మురాద్ ఖేతానీ (సినీ 1 స్టూడియో), భూషణ్ కుమార్ & కృష్ణ కుమార్ (టీ-సిరీస్)లు దీనికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

 

https://twitter.com/RanbirKUniverse/status/1517731029947019266

 

 

 

Exit mobile version