Site icon HashtagU Telugu

Ranbir Kapoor: రణబీర్ కపూర్ 10 లవ్ స్టోరీస్

Ranbir Kapoor comments on his marriage life

Ranbir Kapoor comments on his marriage life

Ranbir Kapoor: చిత్రసీమలో నిలదొక్కుకోవాలి అంటే టాలెంట్ మాత్రమే సరిపోదు. కాస్త సపోర్ట్ లేదా సినిమా పరిశ్రమలో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ అయినా ఉండాలి. సినీ పరిశ్రమలో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఎంట్రీ ఇవ్వకుండానే స్టార్ డమ్ వచ్చేస్తుంది. అలా సినిమాలోకి ఎంట్రీ ఇవ్వకుండానే స్టార్ అయిన నటుడు రణబీర్ కపూర్(Ranbir Kapoor). ప్రస్తుతం బాలీవుడ్ లో మోస్ట్ హ్యాండ్సమ్ బాయ్ రణబీర్ సక్సెస్ ఫుల్ హీరోగా రాణిస్తున్నాడు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన సావరియా సినిమాతో పరిచయం అయిన రణబీర్ కపూర్ ఆ తర్వాత వెను దిరిగి చూసుకోకుండా సక్సెస్ లు దక్కించుకున్నాడు. ఇటీవలే రణబీర్ కపూర్ ప్రముఖ నటి అలియా భట్ ని ప్రేమ వివాహం చేసుకుని ఓ బిడ్డని కూడా కన్నారు, ఇదిలా ఉండగా రణబీర్ కపూర్ ఖాతాలో ప్లే బాయ్ ని తలపించే ప్రేమ కథలు ఉన్నాయి.

1. రణబీర్ కపూర్ టీనేజ్ ప్రియురాలి పేరు అవంతిక మాలిక్ (Avantika Malik).
2. ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ నందితా మోత్వానీ(Nandita Mahtani)తో రణబీర్ కపూర్ డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అందులో ఎంత నిజముందో వాళ్ళకే తెలియాలి.
3. సావరియా” చిత్రీకరణ సమయంలో రణబీర్ సహనటి సోనమ్ కపూర్ (Sonam Kapoor) మధ్య స్నేహం కుదిరింది. అది కాస్త ప్రేమగా మారింది. ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఆఫ్-స్క్రీన్ రొమాన్స్‌ పై అనేక పుకార్లు చక్కర్లు కొట్టాయి.
4. దీపికా పదుకొణె (Deepika Padukone) రణబీర్ కపూర్ మధ్య ప్రేమాయణం నడిచింది. వారి ప్రేమకథ 2007లో ప్రారంభమైంది కానీ 2009లో ముగిసింది. వారు విడిపోయినప్పటికీ, ఇద్దరు సన్నిహితంగా ఉన్నారు.
5. రణబీర్ కపూర్ నర్గీస్ ఫక్రీ(Nargis Fakhri)తో డేటింగ్ చేస్తున్నాడని అప్పట్లో బాలీవుడ్ కోడైకూసిందీ.
6. 2010లో రణబీర్ కపూర్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra)తో ప్రేమాయణం సాగించినట్లు రూమర్స్ వినిపించాయి.
7. రణబీర్ కపూర్ జీవితంలో కత్రినా కైఫ్‌ (Katrina Kaif)ది ప్రత్యేక స్థానం. ఒకానొక సమయంలో ఈ ఇద్దరు పీకల్లోతు ప్రేమలో మునిగితేలారు. 2010 లో వచ్చిన “అజబ్ ప్రేమ్ కి గజబ్ కహానీ” చిత్రం ద్వారా ఈ కపుల్స్ ఒకటయ్యారు. దాదాపు ఆరు సంవత్సరాల పాటు గాఢంగా ప్రేమించుకున్నారు.
8. మోడల్ ఏంజెలా జాన్సన్‌(Angela Jonsson)తో రణబీర్ కపూర్ డేటింక్ చేసినట్టు ఊహాగానాలు స్ప్రెడ్ అయ్యాయి.
9. రణబీర్ జాబితాలో పాకిస్థానీ నటి మహిరా ఖాన్‌ ఉన్నది. ఈమెతో రణబీర్ కపూర్ లవ్ స్టోరీ నడిపించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.
10. రణబీర్ కపూర్ అలియా భట్‌(Alia Bhatt)ని ప్రేమ వివాహం చేసుకుని సెటిల్ అయ్యాడు. ఈ మధ్యే ఈ క్యూట్ కపుల్స్ పండండి బిడ్డకు జన్మనిచ్చారు.

Read More: Shradda Das : సముద్రపు తీరాన శ్రద్ద దాస్ హొయలు