పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. వాటిలో సందీప్ వంగా (Sandeep Reddy Vanga) డైరెక్షన్లో ‘స్పిరిట్’ (Spirit) ఒకటి. ఈ సినిమా ఫై అంచనాలు తారాస్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి తో తన టాలెంట్ ఏంటో చూపించిన సందీప్..ఈ మధ్య యానిమల్ తో బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాదు పాన్ ఇండియా స్థాయి లో తన సత్తా చాటుకున్నాడు. అలాంటి సందీప్..ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడని తెలిసిన దగ్గరి నుండి ఈ సినిమా ఫై ఆసక్తి పెరుగుతూ వస్తుంది.
తాజాగా సినీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం స్పిరిట్ సినిమాలో ఇద్దరు ప్రత్యేకమైన స్టార్స్ ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఫిక్స్ చేశారట. ఆ ఇద్దరూ మరెవ్వరో కాదు అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), యానిమల్ ఫేమ్ రణబీర్ కపూర్ (Ranabir Kapoor). ఈ ఇద్దరికి సూపర్ హిట్‌లు ఇచ్చిన సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ లో వారిని నటింపజేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే ఈ ఇద్దరికీ వారి పాత్ర తాలూకా సీన్లను వినిపించగా..వారు ఓకే చెప్పారని తెలుస్తుంది. అలాగే ఓ స్టార్ హీరోను ఈ చిత్రంలో విలన్ గా తీసుకోవాలని సందీప్ ప్రయత్నిస్తున్నట్లు టాక్. ఈ మూవీలో రెబల్ స్టార్ డ్యుయెల్ రోల్ పోషించనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ప్రభాస్ ..వరుస హిట్స్ ‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ లతో భారీ విజయాలను అందుకున్నాడు. ప్రస్తుతం రాజా సాబ్, ఫౌజీ సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుండగా, స్పిరిట్ సినిమా మాత్రం 2026లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
Read Also : Anil Kumble Birthday : హ్యాపీ బర్త్‌డే అనిల్ కుంబ్లే.. స్పిన్ మాంత్రికుడి కెరీర్, సంపదపై విశేషాలివీ