Animal Trailer అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ రెండు సినిమాలతోనే తన డైరెక్షన్ టాలెంట్ చూపించిన సందీప్ రెడ్డి వంగ నుంచి వస్తున్న థర్డ్ మూవీ యానిమల్. రణ్ బీర్ కపూర్ నటిస్తున్న ఈ సినిమా టీజర్ తోనే గూస్ బంప్స్ తెప్పించగా లేటెస్ట్ గా సినిమా నుంచి ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు. తండ్రి మీద ప్రేమ ఉన్న హీరో అతని కోసం ఏం చేశాడు అన్నది సినిమా కథ.
అనీల్ కపూర్ సినిమాలో రణ్ బీర్ కపూర్ కి తండ్రిగా నటిస్తున్నారు. సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా ట్రైలర్ చూస్తే ఇది సందీప్ మార్క్ మూవీగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా రణ్ బీర్ యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నాయని చెప్పొచ్చు.
డిసెంబర్ 1న రిలీజ్ అవుతున్న యానిమల్ సినిమా ట్రైలర్ తోనే వైబ్రేషన్స్ వచ్చేలా చేసింది. తను తీసిన రెండు సినిమాలను మించి ఈ యానిమల్ ఉండేలా ఉంది. అందుకే ఈ సినిమాకు బిజినెస్ కూడా భారీగా జరుగుతుంది. బాలీవుడ్ నుంచి వస్తున్న పర్ఫెక్ట్ పాన్ ఇండియా మూవీగా యానిమల్ భారీగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
Also Read : Pushpa 2 : పుష్ప 2 బడ్జెట్ పెరిగిందా.. 200 కోట్లు అనుకుంటే ఇప్పుడు..!
We’re now on WhatsApp : Click to Join