Ranam 2 : ముందు శ్రీహరి అనారోగ్య సమస్య.. తరువాత ఆర్తి అగర్వాల్ ఇబ్బంది.. ఈ సినిమాకు ఎన్ని కష్టాలో..

రణం 2 చిత్రం సినిమాకి వచ్చిన ఇబ్బందులు మరే చిత్రానికి వచ్చి ఉండవు. ముందు శ్రీహరి, ఆ తరువాత ఆర్తి అగర్వాల్ అనారోగ్యం.

  • Written By:
  • Publish Date - January 4, 2024 / 10:30 PM IST

ఇండస్ట్రీలో దర్శకులు నటులుగా, యాక్టర్స్, డాన్స్ మాస్టర్స్ దర్శకులుగా మారడం సర్వసాధారణంగా జరుగుతుంది. ఈక్రమంలోనే డాన్స్ మాస్టర్ గా మంచి పేరుని సంపాదించుకున్న అమ్మ రాజశేఖర్(Amma Rajashekar).. దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన సినిమా ‘రణం'(Ranam). 2006లో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమాలో గోపీచంద్ హీరోగా నటించారు. సూపర్ హిట్టుగా నిలిచిన ఈ చిత్రం.. గోపీచంద్ కెరీర్ కి కూడా మంచి బూస్ట్ ని ఇచ్చింది.

ఇక ఈ సినిమా తరువాత అమ్మ రాజశేఖర్.. దర్శకుడిగా రవితేజతో ఖతర్నాక్, నితిన్‌తో టక్కరి సినిమాలు తెరకెక్కించినా హిట్ కాలేదు. దీంతో తాను డైరెక్టర్ గా హిట్ అందుకున్న రణం సినిమాకే సీక్వెల్ తీసుకు రావాలని అనుకున్నారు. ఈక్రమంలోనే కథని సిద్ధం చేసుకున్నారు. అయితే ఈ సినిమా హీరో ఎంపిక విషయంలో చాల మార్పులే జరిగాయి. ఫైనల్ గా రియల్ స్టార్ శ్రీహరిని హీరోగా అనుకున్నారు. ఇక హీరోయిన్ గా ఆర్తి అగర్వాల్ ని ఎంపిక చేశారు. అయితే మూవీ షూటింగ్ మొదలయ్యే టైంకి శ్రీహరి అనారోగ్యం పాలయ్యారు.

దీంతో చిత్రీకరణ స్టార్ట్ చేయడానికి ఆరు నెలలు ఆగాల్సి వచ్చింది. శ్రీహరి(Srihari) కోలుకొని మూవీ షూటింగ్ మొదలైన తరువాత ఆర్తి అగర్వాల్(Arthi Agarwal) తో ఇబ్బంది వచ్చి పడింది. ఈ ఆరు నెలలో ఆమె చాలా లావు అయిపోయారు. కాస్ట్యూమ్స్ కూడా సెట్ అవ్వడం లేదు. దీంతో ఆమె బయటకి రాలేనంటూ అమ్మ రాజశేఖర్ ముందు కన్నీళ్లు పెట్టుకున్నారట. ఇక చాలా బరువు అయిన ఆర్తిని చూసిన రాజశేఖర్ కూడా షాక్ అయ్యారట. మూవీలో ఆర్తి కూడా నటించను అనడంతో మళ్ళీ సినిమా షూటింగ్ ఆగిపోయింది.

దీని తరువాత షూటింగ్ కొంచెం అయ్యాక శ్రీహరి మళ్ళీ అనారోగ్యానికి గురి అవ్వడం, 2013 అక్టోబర్ 9న మరణించడం జరిగిపోయింది. ఆర్తి అగర్వాల్ తో కొంచెం షూటింగ్ అయ్యాక బరువు తగ్గడం కోసం శాస్త్ర చికిత్స చేయించుకొని ప్రాణాలు మీదకి తెచ్చుకొని 2015 జూన్ 6న మరణించారు. ఇక ఆ తరువాత రణం 2ని తానే హీరోగా నటిస్తూ వాళ్ళు ఉన్న సీన్స్ కి తగ్గట్టు కథని మార్చుకొని అమ్మ రాజశేఖర్ తెరకెక్కించారు. అయితే ఈ సినిమా కూడా విజయం సాధించలేకపోయింది.

 

Also Read : Sr NTR : ఎన్టీఆర్ మేకప్ వేసుకున్నారని మొదటి రోజే సినిమా నుంచి తప్పుకున్న సినిమాటోగ్రాఫర్..