Site icon HashtagU Telugu

Rana Naidu : అందరూ విమర్శించినా సరే.. రానా నాయిడు సీజన్ 2 రాబోతుంది..

Rana Naidu Season 2 Coming Soon Netflix Revealed

Rana Naidu Season 2 Coming Soon Netflix Revealed

దగ్గుబాటి బాబాయ్ – అబ్బాయిలు వెంకటేష్(Venkatesh), రానా(Rana) కలిసి ఇటీవల రానా నాయుడు(Rana Naidu) అనే సిరీస్ తో ప్రేక్షకులని పలకరించారు. బాలీవుడ్ వాళ్ళతో వెంకటేష్, రానా మెయిన్ లీడ్స్ లో నెట్‌ఫ్లిక్స్(Netflix) ఓటీటీ(OTT) రానా నాయుడు సిరీస్ ని నిర్మించింది. మొదటిసారి వీరిద్దరూ కలిసి చేయడం, మొదటి సారి ఇద్దరూ వెబ్ సిరీస్(Web Series) లో నటించడంతో సిరీస్ పై రిలీజ్ కు ముందు భారీ అంచనాలు ఉన్నాయి.

కానీ రానా నాయుడు సిరీస్ రిలీజ్ అయిన తర్వాత దేశవ్యాప్తంగా సిరీస్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. సిరీస్ లో అసలు కథే లేకపోగా మొత్తం అడల్ట్ కంటెంట్ ఉండటంతో అందరూ విమర్శించారు. ఫ్యామిలీ హీరోగా పేరున్న వెంకటేష్ లాంటి హీరో అడల్ట్ సిరీస్ లో నటించడంతో వెంకీ తో పాటు, ఇలాంటి సిరీస్ ని తీసినందుకు నెట్‌ఫ్లిక్స్ ని కూడా విమర్శించారు. అయితే ఎంతమంది విమర్శించినా అడల్ట్ కంటెంట్ ఉండటంతో చూసేవాళ్లు చూశారు. దీంతో ఈ సిరీస్ కి మంచి వ్యూయర్ షిప్ వచ్చింది.

తాజాగా నెట్‌ఫ్లిక్స్ రానా నాయుడు సీజన్ 2 కూడా ఉందని ప్రకటించారు. నెట్‌ఫ్లిక్స్ తన సోషల్ మీడియాలో.. మీ ప్రాబ్లమ్స్ ని ఫిక్స్ చేయడానికి మళ్ళీ నాయుడులు వస్తున్నారు. రానా నాయుడు సీజన్ 2 త్వరలోనే రాబోతుంది అని పోస్ట్ చేసింది. దీంతో మరోసారి ప్రేక్షకులు, నెటిజన్లు నెట్‌ఫ్లిక్స్ ని విమర్శిస్తున్నారు. ఈ సారి ఇంకెంత అడల్ట్ కంటెంట్ చూపిస్తావో, ఈ సారన్నా సిరీస్ లో కథ ఉంటుందా అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సారి ఏ రేంజ్ అడల్ట్ కంటెంట్ తో వస్తుందో రానా నాయుడు సిరీస్.

 

Also Read :  Pushpa2 Update: పుష్ప-2లోకి జగ్గూబాయ్ ఎంట్రీ.. కీలక పాత్రలో జగపతి బాబు!