Rana: రానా చిన్నప్పటి ఇంటిని చూసారా ఎంత అందంగా ఉందో.. వీడియో వైరల్?

టాలీవుడ్ ప్రేక్షకులకు హీరో రానా దగ్గుబాటి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాహుబలి సినిమాతో పాన్

  • Written By:
  • Publish Date - April 2, 2023 / 07:30 PM IST

టాలీవుడ్ ప్రేక్షకులకు హీరో రానా దగ్గుబాటి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ని సంపాదించుకున్నాడు హీరో రానా. హీరో హీరోగానే కాకుండా విలన్ గా కూడా నటించి మెప్పించాడు. హీరో నానా పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు బల్లాల దేవ. బాహుబలి సినిమా రానాకు భారీగా గుర్తింపును తెచ్చి పెట్టింది. కాగా హీరో రానా బాహుబలి సినిమా తర్వాత విరాట్ పర్వం సినిమాలో నటించిన అది కాస్త ఊహించిన విధంగా డిజాస్టర్ నిలిచింది. ఇది ఇలా ఉంటే హీరో రానా రానా నాయుడు అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

ఇందులో రానాతో పాటు విక్టరీ వెంకటేష్ కూడా నటించారు. ఈ సంగతి పక్కన పెడితే.. హీరో విక్టరీ వెంకటేష్ కూతురు ఆశ్రిత ఇన్ఫినిటీ ప్లాటర్‌ అనే యూట్యూబ్‌ ఛానెల్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో రకాల వీడియోలు షేర్ చేసింది. మరి ముఖ్యంగా ఫుడ్స్ కి సంబంధించిన వీడియోలను ఎక్కువగా షేర్ చేసింది ఆశ్రిత. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె తన అన్నయ్య హీరో రానాతో కలిసి పిజ్జాలు తయారు చేసింది. పిజ్జాలు తయారు చేస్తూనే వారి తమ చిన్నప్పటి ఇంటిని నెటిజన్లకు పరిచయం చేశారు.

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న ఈ నివాసంలో ప్రస్తుతం శాంచరీ రెస్టారెంట్‌ నడుపుతున్నట్లు హీరో రానా తెలిపారు. తన స్నేహితుడు గోకుల్‌ దీనిని సిద్ధం చేశారని రానా తెలిపారు. ఇంట్లోని రెస్టారెంట్ కి అడుగుపెట్టడంతో రానా, ఆశ్రిత ఇద్దరు వారి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం హీరో రానా సోదరి ఆశ్రితతో కలిసి పిజ్జాలు తయారు చేశారు. మాంసం, చీజ్‌ ఎక్కువగా ఉన్న పిజ్జా తినడమంటే తనకెంతో ఇష్టమని తెలిపారు. కాగా ఆ వీడియోలో రానా ఇంటిని చాలా అద్భుతంగా అందంగా డిజైన్ చేశారు. రెస్టారెంట్ కావడంతో ఎంతో అద్భుతంగా ఆ రెస్టారెంట్ ని డిజైన్ చేశారు. ఆ ఇల్లు చిన్న సైజు 3 స్టార్ హోటల్ లో కనిపిస్తోంది. ఆ ఇంట్లో వారిని నివసించిన ప్రదేశాలను చూపిస్తూ వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆ విషయాల గురించి తెలిపారు. అనంతరం ఇద్దరూ సరదా సరదాగా మాట్లాడుకుంటూ వారు చేసిన పిజ్జాలను తిన్నారు. తర్వాత రానా, రానా నాయుడు వెబ్ సిరీస్ గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.