Rana Daggubati: రానా నాయుడు పాత్రలో మంచి చెడు రెండూ ఉన్నాయి: రానా దగ్గుబాటి

నేను సాధారణంగా గుడ్ లేదా బ్యాడ్ పాత్రలను పోషిస్తాను. కానీ రానా పాత్రలో రెండూ కలసి వుంటాయి.

Published By: HashtagU Telugu Desk
Rana Bheemla Nayak

Rana Bheemla Nayak

బాబాయ్ అబ్బాయి వెంకటేష్ దగ్గుబాటి, రానా దగ్గుబాటి తొలిసారి కలసి నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. గ్రిప్పింగ్ కథాంశం, హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలు, పవర్‌హౌస్ పెర్ ఫార్మెన్స్ లు వున్న ఈ సిరిస్ ఈ నెల 10 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది. ఈ సిరిస్ లో వెంకటేష్, రానా లు తండ్రి కొడుకులుగా ఇద్దరూ పోటాపోటీ పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సిరిస్ పై అందరిలోనూ ఆసక్తిని పెంచింది. తాజాగా ఈ సిరిస్ లో తన పాత్ర గురించిన విశేషాలని పంచుకున్నారు రానా.

ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ.. “నేను సాధారణంగా గుడ్ లేదా బ్యాడ్ పాత్రలను పోషిస్తాను. కానీ రానా పాత్రలో రెండూ కలసి వుంటాయి. రానా డార్క్ లైఫ్ గడుపుతుంటాడు, కానీ తన కుటుంబాన్ని పోషించడానికి కూడా కష్టపడతాడు. పేరు తప్పిస్తే, ఆ పాత్రతో నాకు పెద్దగా సారూప్యత లేదు. రానాకు సంక్లిష్టమైన గతం ఉంది. తను కోపాన్ని చాలా తీవ్రంగా ప్రదర్శిస్తాడు. ఇది నాకు సవాలుగా అనిపించింది.. ఎందుకంటే నేను సాధారణంగా ప్రశాంతంగా ఉంటాను. అదృష్టవశాత్తూ, మా బాబాయ్, నాకు అఫ్ స్క్రీన్ కూడా మంచి బాండింగ్ వుంది. వైరం వున్న పాత్రలో మెప్పించడం ఒక సవాల్ తో కూడుకున్నప్పటికీ.. మేము కేవలం రానా, నాగా పాత్రలు, వాటి మధ్య వుండే ఆవేశం, భావోద్వేగాలపై ద్రుష్టిపెట్టాం’’ అన్నారు.

  Last Updated: 06 Mar 2023, 03:09 PM IST