Site icon HashtagU Telugu

Rana Daggubati: దగ్గుబాటి రానా తండ్రి కాబోతున్నాడా!

Rana

Rana

టాలీవుడ్ సూపర్ స్టార్ రానా దగ్గుబాటి, భార్య మిహీకా బజాజ్ తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారని రూమర్స్ వస్తున్నాయి. అయితే దగ్గుబాటి కుటుంబం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్ 2020 ఆగస్టులో హైదరాబాద్‌లో కొంతమంది కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

ఇటీవల రానా తన ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ పోస్ట్‌లన్నింటినీ తొలగించి, సోషల్ మీడియా నుంచి కొంత సమయం తీసుకుంటున్నట్లు చెప్పాడు. ఆ సమయంలో ఈ జంట మధ్య విభేదాలు ఉన్నట్లు పుకార్లు వ్యాపించాయి. కానీ, కర్వా చౌత్‌ ఫెస్టివల్ లో భాగంగా మిహీకా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేసి రూమర్స్ కు చెక్ పెట్టింది. ప్రస్తుతం రానా వెంకటేష్ దగ్గుబాటితో తన రాబోయే వెబ్ సిరీస్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. సాయి పల్లవితో కలిసి నటించిన ‘విరాట పర్వం’ తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

Exit mobile version