Site icon HashtagU Telugu

Rana Daggubati: చిరు మూవీ నుంచి సైడ్ అయిన రానా…

Rana Daggubati

Rana Daggubati

Rana Daggubati: మెగాస్టార్ చిరంజీవి బింబిసార డైరెక్టర్ మల్లిడి వశిష్ట చెప్పిన స్టోరీకి ఓకే చెప్పారు. గత కొన్ని రోజులుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకున్న ఈ సినిమా ఇప్పుడు సెట్స్ పైకి వచ్చింది. ప్రస్తుతం భీమవరం సమీపంలో షూటింగ్ జరుగుతోంది. జనవరి ఎండింగ్ లేదా ఫిబ్రవరిలో చిరంజీవి ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అవుతారని టాక్.

చిరంజీవి, మల్లిడి వశిష్ట కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో విలన్ పాత్రకు రానా దగ్గుబాటిని తీసుకున్నారని వార్తలు వచ్చాయి. బాహుబలి సినిమాలో భళ్లాలదేవ పాత్రలో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఆతర్వాత విలన్ క్యారెక్టర్ లు వచ్చాయి కానీ.. భళ్లాలదేవ రేంజ్ లో ఉండే క్యారెక్టర్ రాకపోవడంతో విలన్ గా నటించలేదు. ఇప్పుడు చిరంజీవి చేస్తున్న భారీ సోషియో ఫాంటసీ మూవీలో విలన్ పాత్ర రావడం.. అందులో పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండడంతో కథ విన్న వెంటనే ఓకే చెప్పాడు. అయితే.. ఇప్పుడు రానా ఈ మూవీ నుంచి తప్పుకున్నాడని తెలుస్తుంది.

రానా తేజ దర్శకత్వంలో రాక్షసరాజు అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ డేట్స్, చిరంజీవి షూటింగ్ డేట్స్ మధ్య గ్యాప్ లేకపోవడంతో చిరు మూవీ నుంచి తప్పుకున్నాడని తెలిసింది. రానా చేయాలి అనుకున్న ఈ పాత్ర కోసం బాలీవుడ్ నుంచి కనుల్ కిషోర్ కపూర్ ని రంగంలోకి దింపారని తెలిసింది. రంగ్ దే బసందీ సినిమాలో కునల్ నటించాడు. విలన్ క్యారెక్టర్ కు తగ్గ పర్సనాల్టీ ఉండడంతో ఆ క్యారెక్టర్ కు సరిగ్గా సరిపోతాడు అని ఫైనల్ చేశారట.

Also Read: CM Revanth Reddy: దేశంలో కాంగ్రెస్ జెండా ఎగరాలి: సీఎం రేవంత్ రెడ్డి