Site icon HashtagU Telugu

Rana Daggubati : ఆ యాప్‌లో తన భార్యని కలుసుకున్న రానా.. వారం రోజుల్లో పెళ్లి..

Rana Daggubati, Miheeka Bajaj

Rana Daggubati, Miheeka Bajaj

Rana Daggubati : టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి 2020లో పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ‘మిహీక బజాజ్’ అనే అమ్మాయిని ఆగష్టు 8 2020న ప్రేమ పెళ్లి చేసుకొని ఒక ఇంటివారు అయ్యారు. అప్పుడు కరోనా సమయం కావడంతో.. వివాహాన్ని చాలా సింపుల్ గా నిర్వహించేసారు. కాగా అసలు రానా అండ్ మిహీకకి ఎలా పరిచయం అయ్యింది..? వీరిద్దరూ ఎంత కాలం ప్రేమించుకున్నారు..? అనేది చాలా మందికి తెలియదు. ఈ విషయాన్ని రానా రీసెంట్ ఇంటర్వ్యూలో రివీల్ చేసారు.

మెగా డాటర్ కొణిదెల నిహారిక.. ‘కమిటీ కుర్రోళ్ళు’ అనే సినిమాని నిర్మించి రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక చిన్న సినిమాలకు ఎప్పుడు తన మద్దతుని తెలిపే రానా.. కమిటీ కుర్రోళ్ళు సినిమా ప్రమోషన్ కోసం కూడా ఒక ఇంటర్వ్యూ చేసారు. ఆ ఇంటర్వ్యూలో రానాకి ఒక ప్రశ్న ఎదురైంది. “అమ్మాయిల దృష్టిని ఆకర్షించడానికి మీరు చేసిన క్రేజీ పని ఏంటి..?” అని రానాని ప్రశ్నించారు. దానికి రానా బదులిస్తూ.. “నా లైఫ్ లో నేను చేసిన అతి పెద్ద క్రేజీ పని అంటే ‘హౌస్ పార్టీ’ అనే యాప్ డౌన్‌లోడ్ చేయడం” అంటూ చెప్పుకొచ్చారు.

కరోనా సమయంలో ఇంటిలోనే కూర్చున్న రానా.. ‘హౌస్ పార్టీ’ అనే యాప్ డౌన్‌లోడ్ చేసి కొత్త ఫ్రెండ్స్ తో పరిచయాలు పెంచుకుంటున్నారట. ఇక ఆ యాప్ ద్వారానే మిహీక బజాజ్ ని కూడా కలుసుకున్నారట. ఆ యాప్ కంటే ముందే రానాకి మిహీక గురించి తెలుసట. ఇక ఆ యాప్ లో పరిచయం అయిన తరువాత వెంటనే పెళ్లి ప్రపోజల్ పెట్టారట. కలిసిన వెంటనే రానా ప్రపోజల్ పెట్టడంతో కొంచెం కంగారు పడినా.. ఆ తరువాత అలోచించి ఓకే చెప్పారట మిహీక. ఇక ఆ తరువాత వారం రోజుల్లోనే పెళ్లి జరిగిపోయిందట.