Kalki 2898 AD : నేను కల్కిలో నటించడం లేదు.. కానీ సినిమా మాత్రం.. రానా కామెంట్స్..

తాను కల్కిలో నటించడం లేదని రానా దగ్గుబాటి క్లారిటీ ఇచ్చేసారు. కానీ సినిమా మాత్రం..

Published By: HashtagU Telugu Desk
Rana Daggubati Interesting Comments About Prabhas Kalki 2898 Ad

Rana Daggubati Interesting Comments About Prabhas Kalki 2898 Ad

Kalki 2898 AD : హాలీవుడ్ మూవీస్ తరహాలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ మూవీ ‘కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం హిందూ పురాణకథలు నేపథ్యంతో తెరకెక్కుతుంది. హిందూ గ్రంథాల్లో చెప్పబడిన కొన్ని పాత్రలను సూపర్ హీరోలుగా ఈ సినిమాతో వరల్డ్ వైడ్ ఆడియన్స్ కి పరిచయం చేయబోతున్నారు. ఇంతకీ ఆ పాత్రలు ఏంటంటే.. శ్రీమహావిష్ణువు దశావతారం అయిన కల్కితో పాటు సప్త చిరంజీవులు.ఈ సినిమాలో సూపర్ హీరోలుగా కనిపించబోతున్నారు.

ఇక సప్త చిరంజీవుల్లోని ఓ పాత్రని రానా దగ్గుబాటి చేస్తున్నారని, అందుకే రానా కల్కి మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటూ వస్తున్నారని ఇప్పటి వరకు అందురు భావించారు. అయితే తాజా ఇంటర్వ్యూలో రానా మాట్లాడుతూ.. “తాను ఈ సినిమాలో నటించడం లేదని, కేవలం సినిమా ప్రమోషన్స్ కోసమే పని చేస్తున్నాని” చెప్పుకొచ్చారు. దీంతో రానా ఈ సినిమాలో నటించడం లేదని తేలిపోయింది.

అదే ఇంటర్వ్యూలో కల్కి సినిమా గురించి మాట్లాడుతూ.. బాహుబలి తరువాత ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఈ సినిమా మరో టర్నింగ్ పాయింట్ కాబోతుందని చెప్పుకొచ్చారు. మార్వెల్ సినిమాలు మాదిరి కల్కి సినిమా కూడా వరల్డ్ వైడ్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందని, అందుకనే అవెంజర్స్ సినిమాలు మాదిరి కల్కి ఫస్ట్ లుక్ ని కామిక్ కాన్ ఈవెంట్ లో రిలీజ్ చేశామని చెప్పుకొచ్చారు.

రానా మాటల్లో కాన్ఫిడెన్స్ చూసిన ఆడియన్స్ లో ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. కాగా ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని తదితర స్టార్ కాస్ట్ నటిస్తుంది. జూన్ 27న ఈ సినిమాని వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.

Also read : Tripti Dimri : త్రిప్తి తెలుగు సినిమాలకు నో అనేస్తుందా.. కారణాలు ఏంటి..?

  Last Updated: 05 May 2024, 09:58 AM IST