సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా 2025 జనవరి నుంచి సెట్స్ మీదకు వెళ్లబోతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమాలో ఫైనల్ కాస్టింగ్ సెట్ చేసే పనిలో ఉన్నారు రాజమౌళి. RRR తో కేవలం పాటకు మాత్రమే ఆస్కార్ రాగా ఈసారి మహేష్ సినిమాను అన్ని కేటగిరిల్లో రేసులో ఉంచాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. అందుకే సినిమా విషయంలో ప్రతి ఒక్కటి కూడా చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్నారు.
మహేష్ రాజమౌళి (Rajamouli) సినిమా ఫైనల్ కాస్టింగ్ ఎవరన్నది తెలియాల్సి ఉండగా లేటెస్ట్ గా ఈ సినిమాలో ప్రతి నాయకుడిగా రానా నటిస్తాడన్న టాక్ నడుస్తుంది. మహేష్ తో రానా ఫైట్ కచ్చితంగా సంథింగ్ స్పెషల్ గా ఉంటుంది.
బాహుబలిలో భళ్లాలదేవాగా..
రానా ఎలాగు బాహుబలిలో భళ్లాలదేవాగా అదరగొట్టాడు. సో మహేష్ (Mahesh Babu) సినిమాలో కూడా అతను ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో మేకర్స్ ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. మహేష్ తో రానా స్క్రీన్ షేర్ చేసుకుంటే కచ్చితంగా సినిమా రేంజ్ వేరేలా ఉంటుందని చెప్పొచ్చు. మరి ఇంతకీ ఈ సినిమాలో రానా ఉన్నాడా లేదా అన్నది చూడాలి.
మహేష్ మాత్రం ఈ సినిమా కోసం నవర్ బిఫోర్ లుక్ తో అదరగొట్టేస్తున్నాడు. మహేష్ తో ఫైట్ చేసే ఛాన్స్ రానా (Rana)కి వస్తే అతని కెరీర్ కు కూడా ఇది మంచి బూస్టింగ్ ఇచ్చే ఆఫర్ అని చెప్పొచ్చు.
Also Read : Ayyappa Devotees : శబరిమల అయ్యప్ప భక్తుల దర్శనాలపై మూడు కీలక నిర్ణయాలు