టాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ (Krishna Vamsi) మరియు స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ (Ramya Krishna) వివాహ జీవితంపై ఎప్పటినుంచో అనేక రూమర్లు వినిపిస్తున్నాయి. వీరి వివాహం 2003లో జరిగింది. అప్పటి నుండి కూడా వీరిద్దరూ కలిసి కనిపించడం చాలా అరుదుగా ఉంది. ముఖ్యంగా రమ్యకృష్ణ చెన్నైలో, కృష్ణవంశీ హైదరాబాద్‌లో ఉంటున్నారు అనే వార్తలు, వీరి మధ్య విభేదాలు ఉన్నాయనే ఊహాగానాలను మరింత పెంచాయి. అయితే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారని, కేవలం కొడుకు కోసమే కలిసి ఉంటున్నారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుండగా, దీనిపై తాజాగా కృష్ణవంశీ క్లారిటీ ఇచ్చారు.
Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీపై మరో రెండు కేసులు !
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కృష్ణవంశీ.. “రమ్యకృష్ణ చెన్నైలో ఉండటానికి మేము విడాకులు తీసుకున్నామని అనుకోవడం తప్పు. మా ఇద్దరికీ కెరీర్ పరంగా వేరే వేరే నగరాల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ మేం విడిపోలేదు. సమయం దొరికినప్పుడల్లా కలుసుకుంటూ ఉంటాం” అని స్పష్టం చేశారు. భార్యాభర్తలుగా మామూలుగానే ఫంక్షన్లు, పార్టీలకు వెళ్తున్నామని, అయితే వ్యక్తిగత జీవితాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడం ఇష్టపడమని పేర్కొన్నారు. దీంతో వీరి విడాకులపై వస్తున్న అనేక రూమర్లకు తెరపడింది.
Big Breaking : ఉపాధి కూలీలకు శుభవార్త.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల
కృష్ణవంశీ ఈ వివరణ ఇచ్చిన తర్వాత, రమ్యకృష్ణ, కృష్ణవంశీ మధ్య ఎలాంటి విభేదాలు లేవని అందరికీ స్పష్టమైంది. వీరి బిజీ షెడ్యూల్ వల్ల వేరుగా ఉండాల్సి వస్తున్నా, తమ వైవాహిక బంధం బలంగా కొనసాగుతోందని కృష్ణవంశీ చెప్పడం అభిమానులను ఆనందింపజేసింది. సినీ కెరీర్, వ్యక్తిగత జీవితాన్ని సమతూకంగా నిర్వహిస్తున్న రమ్యకృష్ణ, ఇలాంటి రూమర్ల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని, ఆమె తన కుటుంబాన్ని, ప్రొఫెషనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారని ఆయన వ్యాఖ్యలు మరోసారి రుజువు చేశాయి.