Site icon HashtagU Telugu

Ramya Krishnan : ‘నరసింహ’లో నీలాంబరి పాత్ర చేయకూడదు అనుకున్న రమ్యకృష్ణ.. ఎందుకో తెలుసా..?

Ramya Krishnan first Regected Narasimha Villian Role

Ramya Krishnan first Regected Narasimha Villian Role

సౌత్ స్టార్ నటి రమ్యకృష్ణ(Ramya Krishnan) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గ్లామర్ పాత్ర అయినా, పవర్ ఫుల్ రోల్ అయినా.. ఆమె నటనకి దాసోహం అవ్వాల్సిందే. రమ్యకృష్ణ అనగానే ఇప్పటి ఆడియన్స్ కి బాహుబలి ‘శివగామి’ పాత్ర గుర్తుకు వస్తుందేమో గాని, ఒకప్పటి ఆడియన్స్ కి మాత్రం నరసింహ(Narasimha) ‘నీలాంబరి’ పాత్రే గుర్తు వస్తుంది. సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) ఎదురుగా ఆమె చూపించిన విలనిజం తారాస్థాయి.

నిజం చెప్పాలంటే.. నరసింహ సినిమా అనగానే రజినీకాంత్ పాత్ర కంటే ముందు రమ్యకృష్ణ పాత్రే ఎక్కువ గుర్తుకు వస్తుంది. అయితే ఇలాంటి పాత్రని రమ్యకృష్ణ ముందు వద్దు అనుకున్నారట. ఆ పాత్ర చేయడం ఇష్టంలేక మొదట ఓకే చెప్పడానికి ఆలోచించారట. ఈ విషయానికి రమ్యకృష్ణ ఒక సందర్భంలో అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఇంతకీ అసలు ఆమె ఆ పాత్ర చేయకూడదని ఎందుకు అనుకున్నారు..? కారణం ఏంటి అంటే..?

“ఆ సినిమాలో నేను చాలా తల పొగరుతో నటించాల్సి ఉంది. అలాంటి తల పొగరుతో ప్రవర్తించడం నాకు ఇష్టం ఉండదు. అయితే అది సినిమాలో ఒక పాత్రే అని నాకు తెలుసు. కానీ అలా ప్రవర్తిస్తూ నటించడానికి మొదటిలో నా మనసు ఒప్పుకోలేదు. దీంతో ఆ పాత్ర చేయకూడదు అనుకున్నాను. ఒకవేళ దర్శకుడు నన్ను సౌందర్య పాత్ర కావాలా? నీలాంబరి పాత్ర కావాలా? అని అడిగి ఉంటే.. నేను సౌదర్య పాత్ర కావాలని చెప్పేదాన్ని. కానీ అలా జరగలేదు. ఏదేమైనా చివరికి దర్శకుడు విజన్ నమ్మి ఆ పాత్ర చేయడానికి ఒప్పుకున్నాను. ఆయన చెప్పినట్లు ఆ పాత్రని చేశాను. అయితే సినిమాలో ఒక సన్నివేశంలో సౌందర్య ముఖంపై నేను కాలు పెట్టే సీన్ ఉంటుంది. అది చేయడానికి నేను చాలా ఇబ్బంది పడ్డాను” అంటూ చెప్పుకొచ్చారు.

సూపర్ హిట్ డైరెక్టర్ కెఎస్ రవికుమార్ ‘నరసింహ చిత్రాన్ని’ తెరకెక్కించారు. ఇక ఈ సినిమా తమిళ్, తెలుగు భాషల్లో ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే.