Site icon HashtagU Telugu

Ramya Krishna : ఆ రెండు పాత్రలకు మొదటి ఛాయస్ రమ్యకృష్ణ కాదు.. మరెవరో తెలుసా?

Ramya Krishna is not first choice for those movies do you know

Ramya Krishna is not first choice for those movies do you know

టాలీవుడ్(Tollywood) సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ(Ramya Krishna) 1985 లో మలయాళ సినిమాతో నటిగా కెరీర్ ని స్టార్ట్ చేసింది. అక్కడ మొదలైన రమ్యకృష్ణ ప్రయాణం.. తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ వచ్చింది. హీరోయిన్‌గా, విలన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా 100 పైగా సినిమాల్లో నటించింది.

రమ్యకృష్ణ సినీ కెరీర్ ఎంతో మంది స్టార్ హీరోలు పక్కన సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. కానీ రమ్యకృష్ణ అంటే ముందుగా మనకి గుర్తుకు వచ్చేది ఆ రెండు పాత్రలే. అవేంటంటే.. రజినీకాంత్ నరసింహ మూవీలోని ‘నీలాంబరి’ పాత్ర, ప్రభాస్ బాహుబలిలోని ‘శివగామి దేవి’ పాత్ర. ఈ రెండిటిలో రమ్యకృష్ణని తప్ప మరొకరిని ఉహించుకోలేము. అలాంటి ఆ పాత్రలకు ఆ సినిమా దర్శకులు ముందుగా రమ్యకృష్ణను అనుకోలేదు. ఇతర హీరోయిన్లు ఆ ఛాన్స్ ని కాదు అనడంతో రమ్యకృష్ణని వరించాయి.

నరసింహ సినిమాని డైరెక్ట్ చేసిన కె ఎస్ రవికుమార్.. నీలాంబరి వంటి పవర్ ఫుల్ పాత్రకి మీనా అయితే సెట్ అవుతుంది అనుకున్నారట. నరసింహ మూవీకి ముందు ఈ దర్శకుడు చిరంజీవితో స్నేహం కోసం చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. అందులో మీనా హీరోయిన్ గా చేయగా.. ఆ పాత్రలో కొంచెం నెగటివ్ షేడ్స్ ఉంటాయి. అందువలనే నీలాంబరి పాత్రకి ముందుగా మీనాని అడిగారట.

ఇక బాహుబలి సినిమాలో శివగామి దేవి వంటి రాజమాత పాత్రకి అతిలోకసుందరి శ్రీదేవి అయితే సెట్ అవుతుందని అనుకున్నాడట రాజమౌళి. దీంతో శ్రీదేవిని కలిసి రాజమౌళి ఆ పాత్ర గురించి కూడా వివరించాడు. కానీ ఆమె నో చెప్పడంతో రమ్యకృష్ణ ఆ పాత్రలో కనిపించింది. అయితే ఈ ఇద్దరు దర్శకులు ఆ పాత్రల కోసం ముందుగా వేరే నటిని ఉహించుకున్నప్పటికీ.. వారి ఊహకు మించి రమ్యకృష్ణ నటన ఆ పాత్రల్లో కనిపించింది అంటూ చెప్పుకొచ్చారు. అంతలా రమ్యకృష్ణ ఆ పాత్రల్లో నటించేసింది.

 

Also Read : Aamir Khan Marriage : త్వరలో అమీర్ ఖాన్ మూడో పెళ్లి ?