Ramoji Rao OTT థియేటర్లకు వెళ్లడం తగ్గించి ఓటీటీలో సినిమా చూసే ఆడియన్స్ సంఖ్య పెరుగుతుందని తెలిసిందే. థియేటర్ లో ఫ్యామిలీ మొత్తం సినిమా చూడాలంటే ఖర్చు తడిసి మోపెడవుతుంది. అందుకే ఓటీటీ రిలీజ్ అయ్యాక చూసే ఆడియన్స్ సంఖ్య పెరుగుతుంది. ఇక మరోపక్క ఓటీటీ సంస్థల మధ్య పోటీ కూడా అదే రేంజ్ లో ఉంది. అమేజాన్ ప్రైం వీడియో, నెట్ ఫ్లిక్స్ రెండు పోటాపోటీగా ఓటీటీ వరల్డ్ ని శాసిస్తున్నాయి. అయితే వాటికి పోటీగా ఎన్ని ఓటీటీ యాప్ లు వచ్చినా వాటిని క్రాస్ చేయలేకపోతున్నాయి.
తెలుగులో కూడా ఆహా ఓటీటీ మొదలైంది. ఆ తర్వాత చాలా వచ్చాయి. ఈటీవీ నుంచి కూడా ఈటీ విన్ అనే ఓటీటీ లాంచ్ చేశారు. లిమిటెడ్ బడ్జెట్ లో వెబ్ సీరీస్, సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. కేవలం రోజుకి 1 రూపాయ్ ఖర్చు అంటే కేవలం 365 రూపాయల సబ్ స్క్రిప్షన్ ప్రైజ్ తో ఈటీవీ విన్ అలరిస్తుంది.
అయితే ఈటీవీ అధినేత రామోజీరావు మరో భారీ ఓటీటీ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈటీవీ నుంచి మరో ఓటీటీ వస్తుందట. రామోజీ మూవీ మ్యాజిక్ అనే పేరుతో ఆర్.ఎం.ఎం గా అది వస్తుందట. త్వరలోనే దీన్ని లాంచ్ చేస్తారని టాక్. 500 కోట్లతో ఈ ఓటీటీ రాబోతుందని అంటున్నారు.
ఆహా, ఈటీవీ విన్ లాంటి తెలుగు ఓటీటీలు కేవలం తెలుగు కంటెంట్ మాత్రమే ఇస్తున్నాయి. ఆర్.ఎం.ఎం మాత్రం నెట్ ఫ్లిక్స్, అమేజాన్ ప్రైం వీడియోస్ లాగా వరల్డ్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తుందని టాక్. మొత్తానిక్ ఆర్.ఎం.ఎం ప్లాన్ బాగానే ఉంది. ఈ కొత్త ఓటీటీపై మరిన్ని వార్తలు రావాల్సి ఉంది.
Also Read : Ashu Reddy : ఫోటోలే కాదు అషు కామెంట్స్ కూడా రెచ్చగొట్టేస్తున్నాయ్..!