Ramcharan: సినీఇండస్ట్రీ ఆర్థిక వ్యవస్థను నిర్ణయించేది భారీ బడ్జెట్ చిత్రాలే!

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మక మూవీ ఆర్ఆర్ఆర్ వాయిదా పడిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎప్పుడెప్పుడు విడుదల అవుతందా? ఎదురుచూస్తున్నారు. ఒకవైపు కరోనా..

  • Written By:
  • Updated On - January 9, 2022 / 10:32 PM IST

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మక మూవీ ఆర్ఆర్ఆర్ వాయిదా పడిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎప్పుడెప్పుడు విడుదల అవుతందా? ఎదురుచూస్తున్నారు. ఒకవైపు కరోనా.. మరోవైపు సినిమా టికెట్ల ఇష్యూ ఆర్ఆర్ఆర్ పై ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో మెగా హీరో రాంచరణ్ సినిమా టికెట్లు, థియేటర్లపై పలు ఆసక్తికర వాఖ్యలు చేశారు. సినిమా పరిశ్రమ ఆర్థిక వ్యవస్థను నియంత్రించడంలో పెద్ద సినిమాల విడుదలలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నాడు.

భారీ-బడ్జెట్ చిత్రాలు ఉపాధిని సృష్టించడమే కాకుండా.. సిబ్బందిలో కింది స్థాయిలో పనిచేసే వ్యక్తులకు మంచి వేతనం అందేలా చూస్తాయని అభిప్రాయపడ్డారు. స్టార్ వాల్యూ అంశం అనేది మాస్ ప్రేక్షుకులను థియేటర్‌లకు రప్పించడం మాత్రమేనని, థియేటర్ల కూర్చోబెట్టే బాధ్యత పూర్తిగా కథపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశాడు. మొత్తం పరిశ్రమలో వ్యాపార భాగాన్ని పోషించడానికి ప్రతి చిత్రానికి దాని సొంత పాత్ర ఉంటుందని, అయితే పెద్ద సినిమాలు మాత్రమే థియేటర్లకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తాయని పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుందని, పన్నుల రూపంలో కూడా ప్రభుత్వం అతర్భాగంగా ఉంటుందని రాంచరణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

“మనం రాజమౌళిలాంటివాళ్లతో కలిసి పని చేస్తున్నప్పుడు మన పని చాలా సులభం అవుతుంది, అతను ఏమి చేస్తున్నాడో చాలా ఖచ్చితంగా ఉంది. అతను చాలా అభివృద్ధి చెందాడు, ఆయనతో కలిసి పనిచేయడం నిజంగా నా ఆశీర్వాదం. ఓ సాధారణ ప్రేక్షకుడిలానే.. నేను కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను. ఇది భారీ విజయాన్ని అందుకుంటుందని, ఈ స్థాయి చిత్రాన్ని రూపొందించినందుకు మొత్తం టీమ్ కృషిని ప్రతిఒక్కరూ అభినందిస్తున్నారు. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లాంటి చిత్రాలు చిత్ర పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకొస్తాయి’’ అని రాంచరణ్ ఓ ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.