Ravi Teja Fans troll Sarath Mandava: రవితేజ అభిమానుల దెబ్బకు శరత్ మండవ ట్విట్టర్ లాక్

మాస్ హీరో రవితేజ, శరత్ మండవ కాంబినేషన్ లో తెరకెక్కిన రామారావు ఆన్ డ్యూటీ విడుదలైన విషయం తెలిసిందే.

Published By: HashtagU Telugu Desk
Ramarao On Duty

Ramarao On Duty

అప్ కమింగ్ డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వంలో మాస్ హీరో రవితేజ కాంబినేషన్ లో తెరకెక్కిన రామారావు ఆన్ డ్యూటీ ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్న అభిమానులకు షాక్ తగిలింది. ‘రామారావు ఆన్ డ్యూటీ’  విడుదలైన మొదటి రోజునే శరత్ మండవను తిడుతూ రెచ్చిపోయారు. రవితేజ మంచితనాన్ని ఆసరాగా తీసుకోవద్దు అని, డైరెక్టర్ శరత్ సినిమాలకు గుడ్ బై చెప్పాలని మీడియా ముందే హెచ్చరించారు రవితేజ అభిమానులు. అయితే సోషల్ మీడియాలో సైతం డైరెక్టర్ పై విమర్శలు మొదలుకావడంతో శరత్ మండవ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ట్రోలింగ్ బారి నుంచి బయటపడేందుకు  ట్విట్టర్ ఖాతాను లాక్ (ప్రైవేట్ మోడ్‌లో) పెట్టాడు.

రవితేజ ‘ఖిలాడీ’ ఘోర పరాజయం తర్వాత ఇటీవల విడుదలైన మాస్ యాక్షన్ కామెడీ ‘రామారావు ఆన్ డ్యూటీ’పై రవితేజ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. చిత్ర దర్శకుడు శరత్ మండవ ప్రమోషన్స్ సమయంలో  పాజిటివ్ గా మాట్లాడటంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కానీ, సినిమా ఫలితం వేరేలా ఉంది. మొదటిరోజు ప్లాప్ అనే టాక్ ను మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో కొంతమంది రవితేజ అభిమానులు బహిరంగ లేఖ రాశారు, “గత ఫ్లాప్‌ల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. కొత్త సినిమాలు అంగీకరించే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి అంటూ లేఖలో పేర్కొన్నారు. అయితే మొత్తానికి అతిపెద్ద డిజాస్టర్‌లలో ఒకటిగా నిలిచింది.

  Last Updated: 01 Aug 2022, 04:40 PM IST