మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల (Ramana gogula)..ఈయన గురించి మ్యూజిక్ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 1990ల చివరలో మరియు 2000ల ప్రారంభంలో తన సంగీతంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తమ్ముడు, ప్రేమంటే ఇదేరా, బద్రి, యువరాజు వంటి చిత్రాలు ఆయన్ను టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా మార్చాయి. ముఖ్యంగా పవన్ – రమణ గోగుల కలయికలో వచ్చిన సూపర్ హిట్ సాంగ్స్ ఇప్పటికి అలరిస్తుంటాయి. మూడు దక్షిణ భారత భాషలలో సుమారు 25 చిత్రాలకు పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేశాడు. అలాంటి రమణ గోగుల..18 ఏళ్ల తర్వాత వెంకటేష్ తో జత కలవబోతున్నాడు. వెంకటేష్ (Venkatesh) తో గతంలో లక్ష్మీ, ప్రేమంటే ఇదేరా చిత్రాలకు వర్క్ చేసాడు. ఇక ఇప్పుడు మరోసారి వెంకీ సినిమాలో సాంగ్ పాడబోతున్నాడు.
విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) తెరకెక్కిస్తోన్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో ఓ సాంగ్ రమణ పడబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరి ఆ సాంగ్ ఎలా ఉండబోతుందో వినాలన్న , చూడాలన్న కొద్దీ రోజులు ఆగాల్సిందే. ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ తర్వాత వెంకటేశ్ – దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు దీనిని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలై సినీ ప్రియులను ఆకట్టుకుంది. అనిల్ రావిపూడి మార్క్ ఫన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఇది సిద్ధమవుతోంది. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భగవంత్ కేసరి తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తోన్న చిత్రమిదే. ముక్కోణపు క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఈ సినిమాలో వెంకటేశ్ మాజీ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. రాజేంద్రప్రసాద్, సాయికుమార్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Read Also : Fire Accident : సంధ్యా బజార్‌లో భారీ అగ్నిప్రమాదం..పలు దుకాణాలు దగ్ధం