Skanda Talk : ‘స్కంద’ ను పట్టించుకునే వారే లేరా..?

సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. ఓవర్సీస్ లో సినిమాను చూసిన సినీ అభిమానులు , రామ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ వస్తున్నారు. రామ్ బుల్ ఇంట్రడక్షన్ అదిరిపోయిందని , శ్రీలీల సీన్స్ బాగున్నాయని

Published By: HashtagU Telugu Desk
Skanda Talk

Skanda Talk

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన గణేష్ నిమజ్జన (Ganesh Nimajjanam) సందడే నెలకొంది. పల్లె , పట్టణం , నగరం అనే తేడా లేకుండా చిన్న , పెద్ద ఇలా అంత కూడా నిమజ్జన వేడుకల్లో బిజీ గా ఉన్నారు. ఇక హైదరాబాద్ లో అయితే చెప్పాల్సిన పనే లేదు. తెల్లవారు జామునుండే పెద్ద ఎత్తున నగరవాసులు రోడ్ల పైకి వచ్చి గణేష్ కు బై బై చెపుతున్నారు. దీంతో రామ్ నటించిన స్కంద రిలీజ్ ను అంత మరచిపోయారు.

హీరో రామ్ (Ram) – మాస్ డైరెక్టర్ బోయపాటి (Boyapati) కలయికలో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘స్కంద’ (Skanda ). ధమాకా ఫేమ్ శ్రీలీల (Sree Leela) హీరోయిన్ గా నటించగా..థమన్ మ్యూజిక్ అందించారు. భారీ అంచనాల నడుమ ఈరోజు భారీ ఎత్తున పలు భాషల్లో విడుదల అయ్యింది. కాకపోతే ఈ సినిమాను చూసేందుకు సినీ లవర్స్ పెద్దగా ఇంట్రస్ట్ చూపించడం లేదు. యావత్ సినీ లవర్స్ తో పాటు యావత్ ప్రజానీకం..గణేష్ భక్తులు గణేష్ నిమిజ్జనం లో బిజీ గా ఉండడం తో స్కంద ను పట్టించుకోవడం లేదు. మరి రేపటి నుండి సినిమాకు సందడి నెలకొంటుందేమో చూడాలి.

ప్రస్తుతం మాత్రం సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. ఓవర్సీస్ లో సినిమాను చూసిన సినీ అభిమానులు , రామ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ వస్తున్నారు. రామ్ బుల్ ఇంట్రడక్షన్ అదిరిపోయిందని , శ్రీలీల సీన్స్ బాగున్నాయని , యాక్షన్ సీన్స్ మరో లెవల్లో ఉన్నాయని… తమన్ బీజీఎమ్ చించేసాడని చెపుతున్నారు.

Read Also: Bhagat Singh: భగత్ సింగ్ కు నివాళులర్పించిన ప్రధాని మోదీ

  Last Updated: 28 Sep 2023, 12:25 PM IST