Ram – Rana : ముంబై డిన్నర్‌లో రామ్, రానా.. వెబ్ సిరీస్ ప్లానింగ్..!

బాలీవుడ్ నటుడితో ముంబై డిన్నర్‌లో రామ్, రానా. ఏం జరుగుతుంది. అంటే నిజంగానే వెబ్ సిరీస్ ప్లానింగ్..!

Published By: HashtagU Telugu Desk
Ram Rana Daggubati Arjun Rampal At Mumbai Dinner Party

Ram Rana Daggubati Arjun Rampal At Mumbai Dinner Party

Ram – Rana : ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ కి వెబ్ సిరీస్ కల్చర్ బాగా అలవాటు అవుతుంది. దీంతో ఇండియన్ సినిమా రంగంలో కూడా వెబ్ సిరీస్ వస్తున్నాయి. ఆల్రెడీ పలు సిరీస్ ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ ని అందుకోవడమే కాకుండా, సెకండ్ సీజన్ పై కూడా మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్నాయి. అలా వెబ్ సిరీస్ కల్చర్ ని టాలీవుడ్ లో కూడా ముందుకు తీసుకు వెళ్తున్న హీరోలు వెంకటేష్, రానా దగ్గుబాటి, నాగచైతన్య.

ఇప్పుడు హీరో రామ్ కూడా వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ని అలరించేందుకు సిద్దమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ రామ్ తో చర్చలు జరుపుతుందని, రామ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే ఆలస్యమని మొన్నటి వరకు వార్తలు వినిపించాయి. అయితే నిన్నటివరకు వాటిలో ఎంత నిజముందో అనేది క్లారిటీ లేదు. రీసెంట్ గా ఒక వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో.. ఆ వార్తలు నిజమేనా అనిపిస్తుంది.

ఆ వీడియోలో రామ్.. బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్‌పాల్, రానాతో కలిసి కనిపిస్తున్నారు. బి-టౌన్ డిన్నర్ లో పాల్గొన్న వీరి ముగ్గురు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఇది చూసిన నెటిజెన్స్.. ఈ వీడియోకి, మొన్నటి వార్తలకు లింక్ పెడుతున్నారు. నిజంగానే రామ్ వెబ్ సిరీస్ చేయబోతున్నారా..? అనే సందేహం మరింత పెరిగింది. ఒకవేళ రామ్ నిజంగానే వెబ్ సిరీస్ చేస్తుంటే.. రానా కూడా అందులో నటించబోతున్నారా..? అనే సందేహం కూడా కలుగుతుంది.

మరి వీటన్నిటికీ సమాధానాలు దొరకాలంటే.. రామ్ నుంచి అఫీషియల్ అప్డేట్ రావాల్సిందే. రామ్ ప్రస్తుతం ‘డబల్ ఇస్మార్ట్’ సినిమాలో నటిస్తున్నారు. పూరీజగన్నాధ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం బాలీవుడ్ లో కూడా రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం చిత్రీకరణ చివరదశలో ఉంది.

  Last Updated: 31 May 2024, 07:17 PM IST