Skanda Review : స్కంద : రివ్యూ

అఖండ తర్వాత బోయపాటి శ్రీను ఎనర్జిటిక్ స్టార్ ఉస్తాద్ రామ్‌ తో చేసిన సినిమా స్కంద. శ్రీనివాస్ చిట్టూరి నిర్మించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల

  • Written By:
  • Updated On - September 28, 2023 / 01:27 PM IST

నటీనటులు : రామ్‌, శ్రీ లీల, సయి మంజ్రేకర్, శ్రీకాంత్, శరత్‌ లోహితాశ్వ, దగ్గుబాటి రాజా, ప్రభాకర్‌,

సంగీతం: ఎస్‌. తమన్‌

సినిమాటోగ్రఫీ: సంతోష్‌ దేటేక్‌

నిర్మాత: శ్రీనివాస చిట్టూరి పవన్‌ కుమర్‌

దర్శకత్వం: బోయపాటి శ్రీను

అఖండ తర్వాత బోయపాటి శ్రీను ఎనర్జిటిక్ స్టార్ ఉస్తాద్ రామ్‌ తో చేసిన సినిమా స్కంద. శ్రీనివాస్ చిట్టూరి నిర్మించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉంది ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

ఆంధ్ర ప్రదేశ్ సీఎం కూతురిని పెళ్లి పీటలపై నుంచి తీసుకెళ్తాడు తెలంగాణా సీఎం కొడుకు. దాంతో ఇద్దరు సీఎం ల మధ్య గొడవ మొదలవుతుంది. కూతురిని తీసుకెళ్లిన వారి అంతు చూడాలని మనుషులను పెడతాడు. కానీ ఈ టైం లో రుద్రకంటి భాస్కర్ (రామ్‌) రంగంలోకి దిగుతాడు. ఇద్దరు సీఎం లను టార్గెట్ చేస్తూ వాళ్ల కూతుళ్లని కిడ్నాప్ చేస్తాడు. అసలు ఈ భాస్కర్ ఎవరు..? అతనెందుకు సీఎం కూతుళ్లని కిడ్నాప్ చేశాడు..? అతని ఫ్లాష్ బ్యాక్ ఏంటి..? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథనం :

బోయపాటి శ్రీను సినిమా అంటే యాక్షన్ సీన్స్ తో సినిమా అంతా రక్తం ఏరులై పారుతుంది. మ మ మాస్ అనే పదానికి పర్ఫెక్ట్ డెఫినిషన్ ఇచ్చేలా బోయపాటి సినిమాలు ఉంటాయి. తెలుగులో ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా బోయపాటి మాత్రం తనకు నచ్చిన మాస్, సెంటిమెంట్ సీన్స్ నే నమ్ముకుని సినిమాలు చేస్తుంటాడు. అఖండ హిట్ అవడంతో ఆ జోష్ తో ఈసారి రామ్‌ తో స్కంద అంటూ వచ్చాడు బోయపాటి.

స్కంద విషయంలో బోయపాటి మార్క్ అంశాలు పుష్కలంగా ఉన్నాయి. సినిమాలో కథ, కథనాల వీక్ స్పష్టంగా అనిపిస్తుంది. ఎలాంటి లాజిక్స్ లేకుండా సినిమాలో యాక్షన్ సీన్స్ ని, ఎమోషన్ ని కనెక్ట్ అయితే మాత్రం స్కంద నచ్చేస్తుంది. అలా కాకుండా సినిమాలో కొత్తదనం కావాలి అనుకుంటే మాత్రం స్కంద రుచించదు.

రామ్‌ ఎనర్జీని డబుల్ చేసేలా హీరో పాత్ర ఎలివేషన్స్ కాస్త శృతి మించినట్టు అనిపించినా బోయపాటి మీటర్ లో అది కరెక్టే అనిపిస్తుంది. అయితే బలమైన సన్నివేషాలు లేనప్పుడు ఎంత ఎలివేషన్ ఇచ్చినా సరే అది వర్క్ అవుట్ అవదు. ఇద్దరు సీఎం ల మీద హీరో రివెంజ్ అనే పాయింట్ ఏదైతే ఉందో అది అసలు తనది కాదు తన తండ్రి స్నేహితుడిది అని తెలిసి ఆడియన్స్ నిరాశ పడతారు.

బోయపాటి సినిమాల్లో ఎప్పుడు కనిపించే సరైన కథా లోపం స్కందలో కూడా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ యాక్షన్ మెప్పిస్తుంది. ఇంటర్వెల్ కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కాస్త వైలెన్స్ ఎక్కువయినట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా బీభత్సం చేసేశారు. మాస్ ఆడియన్స్ కి కూడా బాబోయ్ ఇక చాలు అనిపించేలా బోయపాటి మాసిజం ఉంటుంది. సినిమాలో ఎంటర్టైన్ మెంట్ పాళ్లు తక్కువ ఉంది. ఎమోషన్ కూడా అంతగా వర్క్ అవుట్ కాలేదు. ఫైనల్ గా బోయపాటి సినిమాలు చూసి ఇష్టపడే వారికి ఇది నచ్చుతుంది.

నటీనటులు :

రామ్‌ తన వరకు చాలా హార్డ్ వర్క్ చేశాడు. స్కంద కోసం తన మేకోవర్ ఫ్యాన్స్ ని మెప్పిస్తుంది. ఫుల్ లెంగ్త్ మాస్ రోల్ లో కెరీర్ లో బెస్ట్ అనిపించాడు. అయితే బోయపాటి భారీ డైలాగుల వెయిట్ మోసే కేపబిలిటీ లేదన్నట్టు కొన్ని సార్లు అనిపిస్తుంది. రామ్‌ పెట్టిన ఎఫర్ట్స్ అన్ని స్క్రీన్ మీద కనిపించాయి. శ్రీ లీల పాత్ర అంతగా ఏం లేదు. ఆమె బదులుగా సినిమాలో మరో హీరోయిన్ సయి మంజ్రేకర్ పాత్ర బాగుంది. శ్రీకాంత్ పాత్ర ఓకే అనేలా ఉంది. మిగతా పాత్రలన్నీ పరిధి మేరకు నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం :

థమన్ మ్యూజిక్ రెండు పాటలు అలరించాయి. రామ్‌, శ్రీ లీల డ్యాన్స్ ఇంప్రెస్ చేశాయి. బిజిఎం మాత్రం అఖండ రేంజ్ లో ఇవ్వలేకపోయాడు థమన్. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉండాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. డైరెక్టర్ గా బోయపాటి తన మార్క్ మూవీ చేశాడు. అయితే కథ కథనాల బలహీనతల వల్ల సినిమా ఆశించిన స్థాయిని అందుకోలేదు.

ప్లస్ పాయింట్స్ :

రామ్‌

బోయపాటి మార్క్ మాస్ సీన్స్

రామ్‌ ఇంట్రో, ఇంటర్వెల్

మైనస్ పాయింట్స్ :

బిజిఎం

స్క్రీన్ ప్లే

క్లైమాక్స్

బాటం లైన్ :

రామ్‌ స్కంద.. ఓన్లీ ఫర్ మాస్ ఆడియన్స్..!

రేటింగ్ : 2.25/5

Also Read : Skanda Talk : ‘స్కంద’ ను పట్టించుకునే వారే లేరా..?