Double Ismart Teaser : పూరి జగన్నాధ్, రామ్ పోతినేని కాంబోలో గతంలో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ మూవీతో సూపర్ హిట్ అందుకున్న వీరిద్దరూ.. ఆ తరువాత వరుస ప్లాప్స్ చూస్తూ వస్తున్నారు. దీంతో ఒక మంచి కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు మరోసారి చేతులు కలిపి.. ఆ సూపర్ హిట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ ని తీసుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. డబల్ బ్లాక్ బస్టర్ అందుకునేందుకు ‘డబుల్ ఇస్మార్ట్’ అంటూ టైటిల్ ని పెట్టి షూటింగ్ స్టార్ట్ చేసారు.
కాగా నేడు మే 15న రామ్ పుట్టినరోజు కావడంతో మూవీ నుంచి టీజర్ ని రిలీజ్ చేస్తూ బర్త్ డే గిఫ్ట్ ని ఇచ్చారు. సంజయ్ దత్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తుంటే.. కావ్య టాపర్ హీరోయిన్ గా కనిపించనున్నారు. టీజర్ ని పూర్తి మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా కట్ చేసారు. పూరి మార్క్ డైలాగ్స్ ని రామ్ తెలంగాణ యాసలో చెప్పి ఆడియన్స్ ని మరోసారి ఆకట్టుకున్నారు. టీజర్ అయితే ఆకట్టుకునేలా ఉంది.
పూరీజగన్నాధ్, ఛార్మి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం గత ఏడాది కాలంగా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. బడ్జెట్ ప్రాబ్లెమ్స్ వల్ల షూటింగ్ లేట్ అవుతూ వస్తుంది. ఇప్పుడు ఈ టీజర్ లో కూడా మూవీ రిలీజ్ డేట్ ని వెయ్యలేదు. షూటింగ్ మొత్తం పూర్తి అయిన తరువాతే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారట.