Site icon HashtagU Telugu

Ram Pothinni : రామ్ ఏంటి ఇలా మారిపోయాడు.. రామ్ నెక్స్ట్ సినిమా పోస్టర్..

Ram Pothineni Bhagyasri Borse Movie Poster Released

Ram Pothineni 22

Ram Pothinni : రామ్ పోతినేని ఇటీవల డబల్ ఇస్మార్ట్ తో వచ్చి పరాజయం చూశాడు. అంతకుముందు వచ్చిన స్కంద సినిమా కూడా కలెక్షన్స్ వచ్చినా హిట్ టాక్ రాలేదు. దీంతో మాస్ సినిమాలకు దూరమయి మళ్ళీ తనకి కలిసొచ్చిన లవ్ జానర్ కి వెళ్ళిపోయాడు. ఇటీవల మహేష్ దర్శకత్వంలో రామ్ పోతినేని 22 వ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే రామ్ 22వ సినిమా నుంచి ప్రీ లుక్స్ వదిలి అందులో రామ్ క్యారెక్టర్ పేరు సాగర్ అని ప్రకటించారు. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమా నుంచి హీరో హీరోయిన్ ఉన్న పోస్టర్ రిలీజ్ చేసి మన సాగర్ గాడి లవ్వు మహాలక్ష్మి అంటూ ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న భాగ్యశ్రీ భోర్సే ని పరిచయం చేసారు.

ఈ పోస్టర్ లో వర్షం పడుతుంటే రామ్ భాగ్యశ్రీ చున్నీతో తుడుచుకుంటున్నట్టు ఉంది. అయితే ఇందులో రామ్ మీసాలు గడ్డం తీసేయడంతో ఓ కొత్త లుక్ లో కనపడుతున్నాడు. గతంలో గడ్డం లేకుండా చాలా సినిమాల్లో ఉన్నాడు కానీ ఇందులో మీసం కూడా తీసేయడంతో అసలు ఇతను రామేనా అని సందేహం కలుగుతుంది. ఈ లుక్ లో రామ్ కాస్త డిఫరెంట్ గా ఉన్నాడు.

మరి సినిమా రిలీజ్ అయ్యాక చూడాలి రామ్ ఎలా ఉంటాడో. ఇక ఈ సినిమా పీరియాడిక్ లవ్ స్టోరీ అని పోస్టర్స్ చూస్తుంటే తెలుస్తుంది. త్వరలోనే సినిమా టైటిల్ అనౌన్స్ చేయనున్నారు.

 

Also Read : HariHara VeeraMallu : హరిహర వీరమల్లు న్యూ ఇయర్ అప్డేట్.. పవన్ పాడిన సాంగ్ రిలీజ్ ఎప్పుడో తెలుసా?