Site icon HashtagU Telugu

Ram & Sreeleela: మైసూర్ లో రామ్, శ్రీలీల సందడి, ఫొటోలు వైరల్!

Rapo

Rapo

బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ మేకర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా ఓ పాన్ ఇండియా సినిమా రూపొందుతోంది. ఇందులో శ్రీ లీల కథానాయిక. పవన్ కుమార్, జీ స్టూడియోస్ సౌత్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. సినిమా ఫైనల్ షెడ్యూల్ మంగళవారం మైసూర్‌లో మొదలైంది. మైసూర్ షెడ్యూల్ కోసం హీరో హీరోయిన్లు రామ్ పోతినేని, శ్రీలీల సోమవారం సాయంత్రం బయలు దేరారు.

ఈ షెడ్యూల్‌లో భారీ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్సుతో పాటు కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. జూన్ 15 వరకు ఈ షెడ్యూల్ కొనసాగుతుందని నిర్మాత శ్రీనివాసా చిట్టూరి తెలిపారు. ఒక్క పాట మినహా సినిమా చిత్రీకరణ అంతా ఈ షెడ్యూల్‌తో పూర్తి అవుతుంది. మైసూర్ ఎయిర్ పోర్ట్‌లో రామ్, శ్రీలీల క్యాండిడ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది. ఆల్రెడీ విడుదల చేసిన ఫస్ట్ థండర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

ముఖ్యంగా రామ్ పోతినేనిని బోయపాటి శ్రీను ప్రజెంట్ చేసిన తీరు అందరిని ఆకట్టుకుంది. థమన్ నేపథ్య సంగీతం సూపర్ అని కాంప్లిమెంట్స్ అందుకుంది. సినిమాపై అంచనాలు మరింత పెంచింది. రామ్ పోతినేని, శ్రీలీల జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను, నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి, బ్యానర్: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్, ప్రెజెంట్స్: జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్, సంగీతం: ఎస్ థమన్, డీవోపీ: సంతోష్ డిటాకే, ఎడిటింగ్: తమ్మిరాజు

Also Read: Samantha Looks: టర్కీ అందాలకు సమంత ఫిదా, కొత్త లుక్స్ లో కెవ్వు కేక!

Exit mobile version