Site icon HashtagU Telugu

Double Ismart : రెమ్యూనరేషన్ తీసుకోకుండా ‘డబుల్ ఇస్మార్ట్’ చేస్తున్న హీరో రామ్.. ఎందుకంటే..?

Ram Pothineni Act In Puri Jagannadh Double Ismart Without Remuneration

Ram Pothineni Act In Puri Jagannadh Double Ismart Without Remuneration

Double Ismart : ప్రస్తుతం ప్లాప్ ల్లో ఉన్న హీరో రామ్ పోతినేని, దర్శకుడు పూరి జగన్నాధ్ కలిసి చేస్తున్న సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ చిత్రం 2019లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’కి సీక్వెల్ గా వస్తుంది. ఈ సినిమా తరువాత అటు పూరి జగన్నాధ్ కి, ఇటు రామ్ కి ఒక్క హిట్టు పడలేదు. దీంతో ఇద్దరు కలిసి మళ్ళీ హిట్ అందుకోవడం కోసం ఈ క్రేజీ సీక్వెల్ ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని పూరి జగన్నాధ్, ఛార్మి కలిసి నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమా కోసం రామ్ పారితోషకం తీసుకోకుండా వర్క్ చేస్తున్నారట. రెమ్యూనరేషన్ కి బదులు షేర్ తీసుకుంటున్నారట. సినిమా రిలీజయ్యి లాభాలు వచ్చిన తరువాత.. వాటిలో షేర్ తీసుకుంటానని రామ్ చెప్పారట. ఇక ‘లైగర్’ దెబ్బతో ప్రస్తుతం నష్టాల్లో ఉన్న పూరి కూడా రామ్ నిర్ణయం కొంచెం బెటర్ అనిపించడంతో.. ఆయన కూడా షేర్ లా రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు ఓకే చెప్పారట. కాగా ఈ సినిమా కోసం పూరి భారీగానే ఖర్చు చేస్తున్నారట. కేవలం ఒక్క క్లైమాక్స్ సన్నివేశం కోసమే దాదాపు 10 కోట్ల వరకు ఖర్చు చేసారని చెబుతున్నారు.

కాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు. కావ్య థాపర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రం మార్చిలోనే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ షూటింగ్ లేటు అవ్వడంతో జూన్ కి పోస్టుపోన్ చేసారు. జూన్ 14న ఈ సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. మరి ఈ సినిమాతో పూరి అండ్ రామ్ కమ్‌బ్యాక్ ఇస్తారా లేదా చూడాలి.

Also read : Pawan Kalyan : పరిటాల రవి, పవన్ మధ్య ఏం జరిగింది.. అసలు గొడవ స్థలం గురించా..?