Site icon HashtagU Telugu

Ram : మహేష్ తో రామ్.. మైత్రి మెగా ప్లాన్..!

Ram Join Hands With Mahesh Babu Mytri Movie Makers Production

Ram Join Hands With Mahesh Babu Mytri Movie Makers Production

అదేంటి సూపర్ స్టార్ మహేష్ (Mahesh Babu) రాజమౌళితో సినిమా చేస్తున్నాడు కదా మళ్లీ రామ్ తో కలిసి ఏం చేస్తున్నాడు అని కన్ ఫ్యూజ్ అవ్వొచ్చు. ఇక్కడ మహేష్ అంటే సూపర్ స్టార్ మహేష్ కాదు డైరెక్టర్ మహేష్ బాబు. సందీప్ కిషన్ తో రారా కృష్ణయ్య సినిమా చేసిన అతను ఆఫ్టర్ లాంగ్ టైం లాస్ట్ ఇయర్ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా చేశాడు. ఆ సినిమాతో అనుష్క కొద్దిపాటి గ్యాప్ తర్వాత తెర మీద కనిపించింది.

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తర్వాత మహేష్ ఒక సూపర్ స్టోరీ (Story)ని సిద్ధం చేసుకున్నాడట. దానికి ఎనర్జిటిక్ స్టార్ రామ్ అయితే పర్ఫెక్ట్ అనుకుని అతనికి వినిపించాడు. కథ నచ్చడంతో రామ్ తో మహేష్ ప్రాజెక్ట్ లాక్ అయ్యింది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

టైర్ 2 హీరోలతో కూడా..

ఓ పక్క పుష్ప 2, RC16, ప్రభాస్ ఫౌజి లాంటి భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూనే మరోపక్క రామ్ లాంటి టైర్ 2 హీరోలతో కూడా సినిమాలు చేస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్. రామ్ తో మహేష్ కాంబో మంచి కథతో వస్తున్నారని తెలుస్తుంది. డబుల్ ఇస్మార్ట్ (Double Ismart) తో ప్రేక్షకులను నిరాశ పరచిన రామ్ (Ram) ఇక మీదట కథల విషయంలో కాస్త జాగ్రత్త వహించాలని ఫిక్స్ అయ్యాడు.

అందుకే కథ ష్యూర్ షాట్ హిట్ గ్యారెంటీ అనుకున్న వారికే ఓకే చెబుతున్నాడు. రారా కృష్ణ, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి రెండు సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన మహేష్ లాంటి డైరెక్టర్ తో రామ్ ఒక క్రేజీ మూవీ చేస్తున్నాడు. మరి ఆ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Also Read : Pooja Hegde : పూజా హెగ్దే బ్యాడ్ లక్ కొనసాగుతుందా..?