RGV vs Nagababu : అదేంటి వర్మ.. మీరు ఇంకా బ్రతికే ఉన్నారా..? – నాగబాబు మెగా కౌంటర్

సోషల్ మీడియా వేదికగా మరోసారి మెగా బ్రదర్ నాగబాబు (Nagababu)-వర్మ(RGV) మధ్య మాటల యుద్ధం (Tweets War) నడుస్తుంది. తాజాగా వర్మ తెరకెక్కించిన వ్యూహాం (RGV Vyuham) మూవీ రిలీజ్ కు సిద్ధం గా ఉంది. కాకపోతే కోర్ట్ బ్రేక్స్ వేస్తుండడంతో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియడం లేదు. ఈ తరుణంలో మెగా బ్రదర్ నాగబాబు – వర్మ కు మధ్య ట్వీట్ వార్ నడుస్తుంది. We’re now on WhatsApp. Click to Join. […]

Published By: HashtagU Telugu Desk
Varma Babu

Varma Babu

సోషల్ మీడియా వేదికగా మరోసారి మెగా బ్రదర్ నాగబాబు (Nagababu)-వర్మ(RGV) మధ్య మాటల యుద్ధం (Tweets War) నడుస్తుంది. తాజాగా వర్మ తెరకెక్కించిన వ్యూహాం (RGV Vyuham) మూవీ రిలీజ్ కు సిద్ధం గా ఉంది. కాకపోతే కోర్ట్ బ్రేక్స్ వేస్తుండడంతో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియడం లేదు. ఈ తరుణంలో మెగా బ్రదర్ నాగబాబు – వర్మ కు మధ్య ట్వీట్ వార్ నడుస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సినిమా విడుదల అవుతున్నటువంటి తరుణంలో అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు చేసినటువంటి కామెంట్లు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి ఎవరైనా వర్మ తలనరికి తీసుకు వస్తే కోటి రూపాయలు ఇస్తానంటూ ఈయన కామెంట్లు చేశారు. ఈ కామెంట్స్ ఫై నాగబాబు స్పందించారు. వర్మపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పూర్తిగా తప్పు నేను కూడా ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నాను వర్మ మీరేమీ భయపడకండి మిమ్మల్ని ఈ ఇండియాలో చంపే ఎదవ ఎవరూ లేరు ఎందుకంటే హీరో విలన్ కొట్లాడుతూ ఉంటే మధ్యలో కమెడియన్ ను చంపేయలేరు కదా మీరు కూడా కమెడియన్ లాంటి వారే అంటూ తన స్టైల్ లో వర్మపై నాగబాబు పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌కు వర్మ రిప్లై ఇచ్చాడు.

నాకంటే నా సినిమాలో మీరు పెద్ద కమెడీయన్‌. మీ తమ్ముడి దగ్గర టీకి డబ్బులు అడుక్కుని టీ తాగండి అంటూ రిప్లై ఇచ్చాడు. ఆ రిప్లైకి కౌంటర్‌ రిప్లై ఇస్తూ మరో పోస్ట్‌ పెట్టాడు నాగబాబు. వర్మ, మీరు నా పోస్ట్‌కి స్పందించినందుకు చాలా సంతోషంగా ఉంది.. కొంచెం షాక్‌కి కూడా గురయ్యా. ఎందుకంటే మీరు చనిపోయి దాదాపు 20 ఏళ్లు దాటింది. ఇంకా బతికున్నాను అనుకుని తిరుగుతున్నారు. కానీ మీ ఆత్మ మాత్రమే తిరుగుతోందని గ్రహించాలి. ఎనీ హౌ ఏదో ఓక రూపంలో నా పోస్టుకి సమాధానం ఇచ్చినందుకు సంతోషం. ఎప్పటికి మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. కీర్తిని కోల్పోయిన కీర్తిశేషులు వర్మ గారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానంటూ నాగబాబు సెటైరికల్‌ పోస్ట్‌ పెట్టాడు.. మరి దీనికి వర్మ ఎలాంటి కౌంటర్ ఇస్తాడో వేచి చూడాలి.

Read Also :

  Last Updated: 30 Dec 2023, 03:07 PM IST