Site icon HashtagU Telugu

Ram Gopal Varma: మరో యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసిన ఆర్జీవీ.. వివేకా హత్య కేసునే స్పెషల్ టాపిక్?

Ram Gopal Varma

Ram Gopal Varma

టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వివాదాస్పద దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు రామ్ గోపాల్ వర్మ. తరచూ ఏదో ఒక విషయంతో వార్తలు నిలవడంతో పాటు ఎవరూ ఒకరిపై కాంట్రవర్సీలు క్రియేట్ చేసే విధంగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా రామ్ గోపాల్ వర్మ ఏం మాట్లాడినా కూడా సంచలమే అని చెప్పవచ్చు. సినిమాలకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా రాజకీయాలకు అలాగే సమాజంలో జరిగే పలు విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తూ కాంట్రవర్సీలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. రాంగోపాల్ వర్మ కు ఇదివరకే సొంతంగా యూట్యూబ్ ఛానల్ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే.

ఇలా ఉంటే తాజాగా మరో యూట్యూబ్ ఛానల్ ని మొదలుపెట్టారు రామ్ గోపాల్ వర్మ. ఇదివరకు మొదలుపెట్టిన యూట్యూబ్ ఛానల్ కేవలం సినిమాలను మాత్రమే. తాజాగా నిజం అనే పేరుతో మరో ఛానల్ ని మొదలుపెట్టిన రాంగోపాల్ వర్మ దానిని అధికారికంగా ప్రకటించాడు. సందర్భంగా సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ నేను ప్రారంభించబోయే నిజం యూట్యూబ్ ఛానల్ ముఖ్య ఉద్దేశం అబద్ధాల బట్టలు ఊడదీయడానికి ఆ బట్టలు ఊడదీసి విసిరి పారిస్తేనే నిజం యొక్క పూర్తి నగ్న స్వరూపం బయటపడుతుంది. అది నిజం ఛానల్ లాంచ్. 25వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు.

 

ఇక యూట్యూబ్ ఛానల్ ని మొదలుపెట్టిన ఆలస్యం ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన వివేకానంద హత్య కేసు గురించే మొదటి టాపిక్ గా తీసుకున్న రాంగోపాల్ వర్మ ఆ విషయం గురించి మాట్లాడుతూ ఒక ట్వీట్ కూడా చేశాడు. వివేక మర్డర్ వెనుక నిజం లోని అబద్ధాలు ఆ అబద్ధాలు చెప్పే వాళ్ళ వెనుక ఉన్న నిజాలు, ఆ నిజాల వెనుక వేరే వాళ్ళు ప్రబోధిస్తున్న అబద్ధపు నిజాలు, ఇంకా వాళ్ళ పై వాళ్లు అందరి నెత్తి మీద రుద్దుతున్న నిజమైన అబద్ధాలు, వాటన్నింటి వెనుక నిజాలు అన్నింటిని తవ్వితీయడమే నిజం ఛానల్ ముఖ్య ఉద్దేశం అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version