గత కొద్ది రోజులుగా సినీ పరిశ్రమను మరియు సోషల్ మీడియాను కుదిపేస్తున్న అంశం ‘iBOMMA రవి’ కేసు. పూర్తి క్వాలిటీతో పైరసీ సినిమాలు అందిస్తూ సినీ పరిశ్రమకు కోట్లలో నష్టం కలిగించిన రవిని పోలీసులు అరెస్ట్ చేసి, iBOMMA మరియు BAPPAM వంటి పైరసీ సైట్లను మూసివేయడంతో నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, కొందరు నెటిజన్లు మాత్రం రవిని ‘రాబిన్ హుడ్’తో పోలుస్తూ అతనికి మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలోనే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) ఈ విషయంపై తనదైన శైలిలో స్పందించి, నెటిజన్లకు షాక్ ఇచ్చేలా బలమైన లాజిక్‌ను ముందుకు తెచ్చారు. రవిని విమర్శిస్తూనే, ఆన్‌లైన్‌లో పైరసీ సినిమాలు చూసే ప్రేక్షకులకు సైతం ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
Yogitaarathore : తనకు శాండ్‌విచ్ ఇచ్చిన బెంగళూరు క్యాబ్ డ్రైవర్‌ను ప్రశంసించిన ముంబై మహిళ!
RGV తన విశ్లేషణలో పైరసీ ఎప్పటికీ ఆగకపోవడానికి కారణం సాంకేతికత అభివృద్ధి లేదా పోలీసింగ్ బలహీనత కాదని స్పష్టం చేశారు. పైరేటెడ్ సినిమాలు చూసేందుకు ఆడియన్స్ ఆసక్తి చూపించేంత వరకూ, వారికి సర్వీస్ చేయడానికి రవి లాంటి వ్యక్తులు ఎల్లప్పుడూ ఉంటారని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, రవి మద్దతుదారులు అతన్ని రాబిన్ హుడ్‌తో పోల్చడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాబిన్ హుడ్‌ను హీరోగా కాకుండా, నేటి నిర్వచనాల ప్రకారం ప్రపంచంలోనే మొదటి ఉగ్రవాదిగా ముద్ర వేయవచ్చని RGV వాదించారు. ధనవంతులను దోచుకుని, చంపి లేని వారికి ఇవ్వడం అనేది అరాచకమే అని అన్నారు. కేవలం ధనవంతులు కావడమే ఒక నేరం అని భావించడం ఎంత నీచమైన ఆలోచనో ఊహించుకోవాలని ఆయన ప్రశ్నించారు. చోరీ చేసిన వస్తువులను తీసుకుంటున్నందుకు నిందితుడిని సాధువుగా చూపడానికి టన్నుల కొద్దీ అజ్ఞానం అవసరమని వర్మ అభిప్రాయపడ్డారు.
పైరసీకి వ్యతిరేకంగా తన వాదనను బలంగా వినిపించిన RGV, సినిమా ఖర్చు ఎక్కువైతే పైరసీని సమర్థిస్తారా?, టికెట్ రేట్లు పెరిగితే కంటెంట్‌ను దొంగిలించాలా? అంటూ ప్రశ్నించారు. ఈ లాజిక్‌ను ఇతర వస్తువులకు అన్వయిస్తూ, BMW ఖరీదైతే షోరూం దోచుకుని ఉచితంగా కార్లు ఇవ్వాలా?, నగలు ఖరీదైతే షాప్ దోచుకుని ఫ్రీగా ఇవ్వాలా? అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఈ రకమైన ఆలోచన సామాజిక పతనం మరియు అరాచకానికి దారితీస్తుందని హెచ్చరించారు. పైరసీని ఆపడానికి, కేవలం సేవలను అందించే వారిని మాత్రమే కాకుండా, పైరేటెడ్ కంటెంట్‌ను చూసే ప్రేక్షకులను కూడా నిందితులుగా పరిగణించాలని ఆయన సూచించారు. భయం మాత్రమే ఈ విషయంలో పనిచేస్తుందని, నైతికత పనిచేయదని, కాబట్టి అలాంటి కంటెంట్ చూస్తున్న 100 మందిని అరెస్ట్ చేసి వారి పేర్లను ప్రచారం చేయాలని RGV ఒక వినూత్న పరిష్కారాన్ని సూచించారు.
