Site icon HashtagU Telugu

RGV-NTR: టీడీపీ పార్టీపై సంచలన వాఖ్యలు చేసిన ఆర్జీవి.. ఎన్టీఆర్ తలుచుకుంటే ఓవర్ నైట్ లో టీడీపీ ఫినిష్ అంటూ?

Mixcollage 22 Feb 2024 07 20 Am 8682

Mixcollage 22 Feb 2024 07 20 Am 8682

టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తరచూ ఎవరో ఒకరిపై సంచలన ట్వీట్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ లేనిపోని వివాదాలను కొని తెచ్చుకుంటూ ఉంటారు ఆర్జీవి. కేవలం సినిమాలకు సంబంధించిన వ్యవహారాలలో మాత్రమే కాకుండా రాజకీయాలకు సంబంధించిన వ్యవహారాలలో కూడా తలదూరుస్తూ ఎవరో ఒకరిపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో రాజకీయాలపై పూర్తిగా ఫోకస్ పెట్టిన రాంగోపాల్ వర్మ పదేపదే టీడీపీ పార్టీని, టీడీపీ నేతలు టార్గెట్ చేస్తూ కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ మేరకు రాజ్యాంగ మరోసారి టీడీపీ పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు రామ్ గోపాల్ వర్మ.

అయితే ప్రస్తుతం ఏపీలో ఉన్న ఎన్నికల హంగామాను పెంచడం కోసం కోసం రాంగోపాల్ వర్మ తన వ్యూహం చిత్రంతో ఎన్నికల మూవీతో రెడీ అవుతున్నారు. మాములుగానే వర్మ సినిమా తీస్తే అది పెద్ద వివాదం అవుతుంది. అలాంటిది కొందరు రాజకీయ నాయకులని టార్గెట్ చేసి సినిమా చేస్తే ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. వర్మ తెరకెక్కించిన వ్యూహం చిత్రం అధికార పార్టీకి అనుకూలంగా ప్రతి పక్ష పార్టీలని టార్గెట్ సహజ విధంగా ఉండబోతోందనే విమర్శలు ఆల్రెడీ మొదలయ్యాయి. వర్మ చేసే పొలిటికల్ కామెంట్స్ కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఎలాంటి సంచలన కామెంట్స్ కి అయినా వర్మ వెనుకాడరు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో వర్మ తెలుగు దేశం పార్టీని, ఎన్టీఆర్ ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదంగా మారేలా ఉన్నాయి.

వర్మ తరచుగా చంద్రబాబుని, లోకేష్, పవన్ కళ్యాణ్ లని టార్గెట్ చేయడం చూస్తూనే ఉన్నాం. కానీ తాజాగా వ్యూహం మూవీ ప్రమోషన్ లో భాగంగా వర్మ మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్ ని టీడీపీ దూరం చేసిందా లేక అతడే దూరంగా ఉంటున్నాడా అనేది నాకు తెలియదు. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత అంత క్రేజ్ ఉన్నది జూనియర్ ఎన్టీఆర్ కే. ఆ భయం టీడీపీలో కూడా ఉంది. ఎన్టీఆర్ ఒక్కసారి నేను రాజకీయాల్లోకి వస్తున్నాను అని ప్రకటన చేస్తే టీడీపీ ఓవర్ నైట్ లో ఫినిష్ అయిపోతుంది అంటూ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేష్ కి ఇక ఏమీ మిగలదు అని వర్మ అన్నారు. బహుశా ఆ భయంతోనే ఎన్టీఆర్ పై ద్వేషం పెంచుకుని ఉండవచ్చు అంటూ వర్మ సంచలన వాఖ్యలు చేసారు.