Site icon HashtagU Telugu

Rajamouli: డైరెక్టర్ రాజమౌళి హత్యకు కుట్ర.. అందులో తాను భాగమే అంటూ ఆర్జీవీ కామెంట్స్..!

Rajamouli And James Cameron

Rajamouli And James Cameron

వివాదాల వర్మ మరో సంచలన ట్వీట్ తో వచ్చారు. ఈసారి రాజమౌళి (Rajamouli) టార్గెట్ గా కొన్ని ఊహించని కామెంట్స్ చేశారు. ఆయన్ని చంపేందుకు కుట్ర జరుగుతుందంటూ బాంబు పేల్చాడు. జేమ్స్ కామెరాన్ లాంటి వారు రాజమౌళి సినిమా గురించి, అందులోని సన్నివేశాల గురించి మాట్లాడితే ఎవరికైనా ఈర్ష్య కల్గుతుందని, మన భారతీయ దర్శకుల్లో చాలా మంది అలాంటివారే ఉన్నారని, వీరంతా కూటమిగా ఏర్పడి రాజమౌళిని చంపే ప్రయత్నం చేస్తున్నారు. ఆ గ్రూప్‌లో తాను కూడా ఉన్నానంటూ వర్మ ట్వీట్ చేశాడు. అయితే తనకు నాలుగు పెగ్గులు తగలడంతో ఈ విషయాన్ని వెల్లడించానని ఆయన పేర్కొన్నారు.

Also Read: SpiceJet: స్పైస్‌జెట్ విమానంలో గొడవ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

రాజమౌళిని ముద్దుపెట్టుకున్న జేమ్స్ కామెరాన్ వీడియోపై వర్మ స్పందించారు. మొఘల్ ఈ ఆజం తీసిన క ఆసిఫ్ నుంచి షోలే తీసిన రమేష్ సిప్పీ వరకు.. ఆదిత్య చోప్రా, కరణ్ జోహార్, బన్సాలీ లాంటి వాళ్లను మించిపోయావు.. నీ కాలి వేళ్ళు నోట్లో పెట్టుకోవాలని ఉందని తన మార్క్ వ్యాఖ్యలు చేశాడు వర్మ. ఆ తర్వాత మరో ట్వీట్ చేసి ఆశ్చర్యపరిచాడు. రాజమౌళి సార్ ప్లీజ్ మీ సెక్యూరిటీ పెంచుకోండి.. ఇండియాలో ఫిల్మ్ మేకర్స్ ద్వేషంతో రగిలిపోతున్నారు.. వాళ్లంతా గూడు కట్టుకుంటున్నారు.. మిమ్మల్ని చంపాలని చూస్తున్నారు.. అందులో నేనూ ఉన్నాను అని ట్వీట్ చేసాడు. అయితే నిజంగా ఎవరైనా అలా చేస్తారా? అని ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజమౌళి హత్యకు కుట్ర అనేది వర్మ వాడిన మాటలే అని తెలుస్తోంది. ఏది ఏమైనా వర్మ మరో కొత్త చర్చకు నాంది పలికాడు.