Site icon HashtagU Telugu

RGV – Amitabh : అమితాబ్ బచ్చన్‌ని ఆర్జీవీ ఏమని పిలుస్తాడో తెలుసా..? వాళ్ళిద్దరి మధ్య ఎంత బాండింగ్ ఉందో తెలుసా?

Ram Gopal Varma calls Amitabh Bachchan with Nick Name and their Relation

Ram Gopal Varma calls Amitabh Bachchan with Nick Name and their Relation

రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma), అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) కలయికలో అరడజనకు పైనే సినిమాలు వచ్చాయి. వాటిలో పలు సూపర్ హిట్స్ ఉన్నాయి. కొన్ని డిజాస్టర్స్ ఉన్నాయి. ఇక ఈ సినిమాలతో వర్మ, బచ్చన్ ల మధ్య చాలా మంచి స్నేహమే ఏర్పడింది. ఎంతలా అంటే.. అమితాబ్ అపాయింట్మెంట్ లేకుండానే వర్మ డైరెక్ట్ గా ఇంటికి వెళ్లి కలుసుకునే అంత బంధం. అయితే ఈ స్నేహంలో రామ్ గోపాల్ వర్మ.. అమితాబ్ బచ్చన్ ని ఏమని పిలుస్తాడో మీకు తెలుసా..?

ఆర్జీవీ అమితాబ్ తో ఒక సూపర్ హిట్ సినిమా చేశాడు. ఇక అప్పటి నుంచి ఆ మూవీలోని అమితాబ్ నటించిన పాత్ర పేరుతోనే వర్మ ఇప్పటికీ పిలుస్తూ వస్తున్నాడట. ఇంతకీ ఆ సినిమా ఏంటి? ఆ పేరు ఏంటి? అని ఆలోచిస్తున్నారా. అదే అమితాబ్ తో వర్మ తీసిన మొదటి చిత్రం సర్కార్ (Sarkar). ఈ సినిమాలో అమితాబ్ పాత్ర పేరు ‘సుభాష్ నాగ్రే సర్కార్’. అయితే మూవీలో అందరూ సర్కార్ అని పిలుస్తుంటారు. ఆర్జీవీ కూడా అప్పటినుంచి అమితాబ్ ని సర్కార్ అంటూ పిలుస్తూనే వస్తున్నాడు. ఈ విషయాన్ని వర్మ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు.

2005 లో రిలీజ్ అయిన ఈ సినిమా పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కింది. అభిషేక్ బచ్చన్, కత్రినా కైఫ్, అనుపమ్ ఖేర్, కోటశ్రీనివాస రావు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో దీనికి సీక్వెల్ గా 2008 లో ‘సర్కార్ రాజ్’ అనే సినిమా తీసుకు వచ్చాడు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఓకే అనిపించుకుంది. చివరిగా ఈ మూవీ సిరీస్ లో భాగంగా 2017 లో సర్కార్ 3ని తీసుకు వచ్చారు. అయితే ఆ చిత్రం భారీ డిజాస్టర్ గా నిలిచింది.

 

Also Read : Kamna Jethmalani : జూనియర్ ఎన్టీఆర్ పక్కన ఛాన్స్ మిస్ చేసుకున్న కామ్నా..