ఇటీవల అభిమానులు (Fans) చేసే పనులకు హీరోలకు పెద్ద సమస్యలు గా మారుతున్నాయి. అభిమానుల పిచ్చి అభిమానం ప్రాణాలు పోయేవరకు చేస్తున్నాయి. రీసెంట్ గా అల్లు అర్జున్ విషయంలో ఇదే జరగడం..ఆయన్ను ఏకంగా జైలు లో గడిపే వరకు తీసుకెళ్లింది. ఈ ఘటన గురించి ఇంకా మాట్లాడుకుంటుండగానే..తాజాగా మరో మెగా అభిమాని ఆత్మహత్య చేసుకుంటా అంటూ ఏకంగా లేఖ (Mega fan suicide letter ) రాయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న గేమ్ ఛేంజర్ (Game Changer) మూవీ మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ పై మెగా అభిమానుల్లోనే కాదు యావత్ ప్రేక్షకుల్లో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అయితే మేకర్స్ మాత్రం సినిమా ప్రమోషన్ విషయంలో పెద్దగా ఇంట్రస్ట్ చూపించకపోవడం పై అభిమానులు మొదటి నుండి ఆగ్రహం గా ఉన్నారు. సినిమా రిలీజ్ కు దగ్గర పడుతున్న కానీ ఇంకా స్పీడ్ చేయడం లేదని సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం చూపిస్తున్నారు.
ఈ క్రమంలో ఓ అభిమాని త్వరలో గేమ్ ఛేంజర్ ట్రైలర్ విడుదల చేయాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని లేఖ రాయడం కలకలం రేపుతోంది. ‘సినిమాకు ఇంకా 13రోజులే ఉంది. అభిమానుల ఎమోషన్స్ను పట్టించుకోవడం లేదు. ఈనెలాఖరు లేదా జనవరి 1 వరకు రిలీజ్ చేయకపోతే నేను ఆత్మహత్యకు పాల్పడతాను’ అని రాసుకొచ్చాడు. కాగా దీనిపై స్పందించిన మేకర్స్ ప్రోగ్రామ్స్ ప్లాన్ ప్రకారం జరుగుతాయని చెప్పుకొచ్చారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ ఎవరన్నది ఎగ్జైటింగ్ గా ఉంది. కొందరు మెగాస్టార్ చిరంజీవి వస్తారని అంటుంటే మరికొందరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా వస్తారని అంటున్నారు. గేమ్ ఛేంజర్ కు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరొచ్చినా సినిమా ని మరింత ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లినట్టు అవుతుంది.
ఇప్పటికే మెగా ఫ్యాన్స్ అంతా ఈ సినిమాను ఓన్ చేసుకున్నారు. గేమ్ ఛేంజర్ సినిమాతో భారీ టార్గెట్ నే పెట్టుకున్నాడు చరణ్. ఈ సినిమాతో మరోసారి తన బాక్సాఫీస్ స్టామినా ఏంటన్నది చూపించబోతున్నాడు. ఈ సినిమా విషయంలో మేకర్స్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. గేమ్ ఛేంజర్ సినిమాతో చరణ్ భారీ టార్గెట్ పెట్టుకున్నాడు. ఆర్.ఆర్.ఆర్ తో 1000 కోట్లు కలెక్ట్ చేసిన చరణ్ ఈసారి సోలోగా ఆ మార్క్ అందుకోవాలని చూస్తున్నాడు. మరి సినిమా ఆ రేంజ్ ఉంటుందా లేదా అన్నది చూడాలి.
Read Also : Indian Railways : జనవరి 1 నుంచి రైల్వే కొత్త టైం టేబుల్