Allu Arjun : అల్లు అర్జున్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో మరో ప్రైవేట్ అకౌంట్ ఉందా.. రివీల్ చేసిన ఉపాసన..

అల్లు అర్జున్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో మరో ప్రైవేట్ అకౌంట్ ఉందా..? ఈ విషయాన్ని రామ్ చరణ్ సతీమణి ఉపాసన రివీల్ చేసారు.

Published By: HashtagU Telugu Desk
Ram Charan Wife Upasana Reveals Allu Arjun Private Instagram Account

Ram Charan Wife Upasana Reveals Allu Arjun Private Instagram Account

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి ఇన్‌స్టాగ్రామ్ లో ఎంతటి ఫాలోయింగ్ ఉందో సపరేట్ గా చెప్పనవసరం లేదు. 24 మిలియన్స్ పైగా ఫాలోవర్స్ తో సౌత్ ఇండియన్ స్టార్స్ లో.. బన్నీ అత్యధిక ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ కలిగిన స్టార్ గా నిలిచారు. అయితే అల్లు అర్జున్ ఈ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ తో పాటు మరో ప్రైవేట్ అకౌంట్ కూడా ఉందట. ఈ విషయాన్ని రామ్ చరణ్ సతీమణి ఉపాసన రివీల్ చేసారు.

సినిమా సెలబ్రిటీస్ ప్రైవేట్ అకౌంట్స్ ఉపయోగించడం కామన్ గానే జరుగుతుంది. ఫ్యాన్స్ కోసం పబ్లిక్ గా ఒక అకౌంట్ తో అందరికి కనిపిస్తుంటారు. అలాగే ఫ్యామిలీ ప్రైవసీ కోసం ఓ ప్రైవేట్ అకౌంట్ కూడా ఉపయోగిస్తుంటారు. అల్లు అర్జున్ కూడా తన ఫ్యామిలీ కోసం ఇన్‌స్టాగ్రామ్ లో అలాంటి ఓ ప్రైవేట్ అకౌంట్ ని ఉపయోగిస్తున్నారు. నిన్న ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు అన్న సంగతి అందరికి తెలిసిందే.

దీంతో సోషల్ మీడియా వేదికగా ప్రతిఒక్కరు బన్నీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చారు. ఈక్రమంలోనే ఉపాసన కూడా అల్లు అర్జున్ కి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ.. తన ఇన్‌స్టా స్టోరీలో అల్లు అర్జున్ ప్రైవేట్ అకౌంట్ ని ట్యాగ్ చేసారు. ఇక అది గమనించిన అభిమానులు.. ఆ ప్రైవేట్ అకౌంట్ ని ఓపెన్ చేసి చెక్ చేసేస్తున్నారు. bunny_boy_private అనే పేరుతో అల్లు అర్జున్ ఆ అకౌంట్ ని మెయిన్‌టైన్ చేస్తున్నారు.

కాగా రామ్ చరణ్ కూడా నిన్న అల్లు అర్జున్ కి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ప్రత్యేక ఫోటో షేర్ చేసారు. అల్లు అర్జున్, అయాన్ తో కలిసి రామ్ చరణ్ సెల్ఫీ దిగుతున్న ఫోటోని షేర్ చేసి చరణ్ బన్నీకి బర్త్ డే విషెస్ ని తెలియజేసారు. ఈ పిక్ మెగా ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ గా మారింది.

Also read : Devara : దేవర స్టోరీ లైన్ ఎలా ఉంటుందో చెప్పిన ఎన్టీఆర్..

  Last Updated: 09 Apr 2024, 11:24 AM IST