Site icon HashtagU Telugu

Ram Charan : అంబానీ పెళ్లి నుంచి లండన్ బయలుదేరిన రామ్ చరణ్..

Ram Charan, Anantradhikawedding, Rc16

Ram Charan, Anantradhikawedding, Rc16

Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన సతీమణి ఉపాసన, కూతురు క్లీంకారతో కలిసి అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వివాహానికి హాజరయ్యిన సంగతి తెలిసిందే. గత గురువారం ముంబై పెళ్ళికి వెళ్లిన రామ్ చరణ్ కుటుంబం.. అక్కడే ఈ నాలుగు రోజులు ఉండి పెళ్లి ఈవెంట్స్ లో పాల్గొన్నారు. చరణ్ తో పాటు టాలీవుడ్ నుంచి పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, వెంకటేష్, అఖిల్ అక్కినేని కూడా పాల్గొన్నారు. కాగా అక్కడ పెళ్లి కార్యక్రమం పూర్తి అవ్వడంతో సెలబ్రిటీస్ అంతా మళ్ళీ హైదరాబాద్ చేరుకుంటున్నారు.

కానీ రామ్ చరణ్ మాత్రం హైదరాబాద్ కాకుండా లండన్ బయలుదేరుతున్నారు. ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ పూర్తి చేసుకున్న రామ్ చరణ్.. త్వరలో RC16 చిత్రీకరణ మొదలుపెట్టబోతున్నారు. అయితే ఈ మధ్యలో ఫ్యామిలీతో ఓ వెకేషన్ వెళ్లాలని ప్లాన్ చేసారు. ఈక్రమంలోనే లండన్ కి బయలుదేరారు. ముంబైలో అంబానీ పెళ్లి కార్యక్రమం పూర్తి చేసుకున్న చరణ్ ఫ్యామిలీ.. డైరెక్ట్ గా ముంబై నుంచే లండన్ కి బయలుదేరారు. మరి ఈ వెకేషన్ ఎన్ని రోజులు ఉండబోతుందో చూడాలి.

చరణ్ అభిమానులైతే RC16 రెగ్యులర్ షూటింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ మూవీ ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అనే క్యూరియాసిటీతో ఉన్నారు. ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు ఆ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ని చాలా పకడ్బందీగా నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ టీం దుబాయ్ లోని వరల్డ్ క్లాస్ రికార్డింగ్ స్టూడియోలో మ్యూజిక్ సిట్టింగ్స్ చేస్తుంది. ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్న విషయం అందరికి తెలిసిందే. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శివ రాజ్ కుమార్ ముఖ్య పాత్ర చేస్తున్నారు.