Ram Charan : చరణ్ పుట్టిన రోజు స్పెషల్.. భార్య, కూతురుతో కలిసి తిరుమలలో దర్శనం..

చరణ్, ఉపాసన కూతురు క్లిన్ కారా కలిసి నేడు ఉదయం తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

Published By: HashtagU Telugu Desk
Ram Charan Visited Tirumala Sri Venkateswara Swami Temple with Wife Upasana and Daughter Klin Kara

Ram Charan Visited Tirumala Sri Venkateswara Swami Temple with Wife Upasana and Daughter Klin Kara

నేడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) పుట్టిన రోజు. అభిమానులు చరణ్ పుట్టిన రోజుని కేక్ కటింగ్స్, పలు సేవా కార్యక్రమాలతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో అభిమానులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు చరణ్ కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక చరణ్ పుట్టిన రోజుని తన భార్య ఉపాసనతో కలిసి తిరుమలలో(Tirumala) వేంకటేశ్వరస్వామి సన్నిధిలో జరుపుకోడానికి వెళ్లారు.

నిన్న ఉపాసన, చరణ్, కూతురు క్లిన్ కారా కలిసి హైదరాబాద్ నుంచి తిరుపతికి ఫ్లైట్ లో వెళ్లారు. నేడు ఉదయం తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. చరణ్, ఉపాసనలకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. చరణ్ తిరుమలకు రావడంతో అభిమానులు, భక్తులు చరణ్ ని చూడటానికి, ఫోటోలు దిగడానికి ఎగబడ్డారు.

ఇక రామ్ చరణ్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ షూట్ జరుగుతుండగా ఈ సినిమా డిసెంబర్ లో రిలీజ్ అవుతుందని సమాచారం. ఆ తర్వాత బుచ్చిబాబు సాన దర్శకత్వంలో RC16, సుకుమార్ దర్శకత్వంలో RC17 సినిమాలు ఉన్నాయి.

 

Also Read : Game Changer : హమ్మయ్య ‘గేమ్ ఛేంజర్’ సాంగ్ వచ్చేసింది.. జరగండి.. జరగండి..

  Last Updated: 27 Mar 2024, 09:56 AM IST