Ram charan Vetrimaran : వెట్రిమారన్ కథ చరణ్ ఓకే చేశాడా..?

Ram charan Vetrimaran తమిళంలో టాలెంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరైన వెట్రిమారన్ అక్కడ తన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. వెట్రిమారన్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్స్

  • Written By:
  • Publish Date - May 25, 2024 / 06:08 PM IST

Ram charan Vetrimaran తమిళంలో టాలెంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరైన వెట్రిమారన్ అక్కడ తన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. వెట్రిమారన్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పొచ్చు. ఆయన డైరెక్షన్ లో సినిమా వస్తుంది అంటే ఆడియన్స్ అంతా కూడా అలర్ట్ గా ఉంటారు. వెట్రిమారన్ తో సినిమా చేయాలని కోలీవుడ్ స్టార్స్ మాత్రమే కాదు తెలుగు హీరోలు కూడా ఆసక్తి చూపిస్తుంటారు.

వెట్రిమారన్ తో సినిమా కోసం ఇప్పటికే తెలుగు స్టార్ హీరోలు అల్లు అర్జున్, ఎన్.టి.ఆర్ ఆసక్తిగా ఉన్నారని వార్తలు వచ్చాయి. వీరిద్దరిలో ఒకరితో వెట్రిమారన్ సినిమా చేస్తారని అనుకున్నారు. కానీ వెట్రిమారన్ తో సినిమా లిస్ట్ లో గ్లోబల్ స్టార్ రాం చరణ్ చేరాడని తెలుస్తుంది.

ప్రస్తుతం రాం చరణ్ శంకర్ డైరెక్షన్ లో గేం చేంజర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత బుచ్చి బాబు డైరెక్షన్ లో సినిమా వస్తుంది. ఆ తర్వాత వెట్రిమారన్ సినిమా ఉంటుందని టాక్. అల్లు అర్జున్, ఎన్.టి.ఆర్ ఇద్దరిని కాదని వెట్రిమారన్ చరణ్ తో సినిమా చేయాలని చూస్తున్నాడట. ఆల్రెడీ చరణ్ కి ఒక కథ వినిపించడం జరిగిందని తెలుస్తుంది.

చరణ్ తో వెట్రిమారన్ సినిమా కన్ఫర్మ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఉంటుందని చెప్పొచ్చు. ఆర్.ఆర్.ఆర్ తో గ్లోబల్ వైడ్ తన సత్తా చాటిన చరణ్ రాబోతున్న సినిమాలతో ఇంటర్నేషనల్ లెవెల్ లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. గేం చేంజర్ సినిమాతోనే చరణ్ రికార్డులు మొదలవుతాయని అంటున్నారు.

Also Read : Madhya Pradesh: సినిమా తరహాలో దొంగతనం.. ఎవర్రా మీరంతా అంటున్న కాప్స్