Ram Charan’s Daughter: క్లీంకార కోసం స్పెషల్ రూమ్, వీడియో షేర్ చేసిన ఉపాసన

రామ్ చరణ్, ఉపాసన జూన్ 20, 2023న తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందిన విషయం తెలిసిందే.

Published By: HashtagU Telugu Desk
Upasana gave birth to a baby girl today morning in Apollo hospital Hyderabad

Upasana gave birth to a baby girl today morning in Apollo hospital Hyderabad

రామ్ చరణ్, ఉపాసన జూన్ 20, 2023న తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందిన విషయం తెలిసిందే. ఈ జంట మొదటి బిడ్డగా కుమార్తె క్లిం కారాతో ఆశీర్వదించారు. మాతృత్వాన్ని స్వీకరించిన తర్వాత, ఉపాసన తన కొత్త ప్రయాణంలోని ప్రతి చిన్న అంశాన్ని డాక్యుమెంట్ చేస్తూ వచ్చింది. తన బిడ్డ కోసం ఇంటిని ప్రత్యేకంగా గదిని తీర్చిదిద్దింది. ఇందుకోసం ఇంటీరియర్స్ సలహాలను కూడా తీసుకుంది. నల్లమల ఫారెస్ట్ లో అరుదుగా దొరికే వస్తువులతో గదిని డిజైన్ చేయించింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో అనేక మంది తల్లులను ఆకట్టుకుంటోంది.

చరణ్, ఉపాసన దంపతులు పెళ్లైన 11 యేళ్ల తర్వాత ఓ బిడ్డకు జన్మనిచ్చారు. దీంతో అభిమానులు మెగాస్టార్ చిరంజీవి ఇంటికి మరో ధనలక్ష్మీ వచ్చిందని సంబరపడ్డారు. మా ఇష్ట దైవం ఆంజనేయ స్వామికి ప్రీతి పాత్రమైన మంగళ వారం రోజున మా ఇంటికి మహా లక్ష్మీ వచ్చిందని చిరంజీవి సంతోషం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.  అంతేకాదు పుట్టిన ఘడియలు కూడా బాగున్నాయని ఆయన చెప్పారు.

  Last Updated: 14 Jul 2023, 03:12 PM IST