Site icon HashtagU Telugu

Ram Charan Reveal: ఉపాసనకు అమ్మాయే పుడుతుందట.. క్లారిటీ ఇచ్చేసిన రామ్ చరణ్!

Ram Upasana Imresizer

Ram Upasana Imresizer

దాదాపు పదేళ్ల తర్వాత మెగాహీరో రామ్ చరణ్ (Ram Charan), భార్య ఉపాసన (Upasana) దంపతులు మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఉపాసన ప్రెగ్నెన్సీ వార్త మెగా కుటుంబంలో ఆనందాన్ని నింపింది. అయితే ఈ జంటకు ఆడ బిడ్డ (Baby Girl) పుడుతుందా? మగబిడ్డ పుడతాడా? అంటూ మెగా అభిమానులు చర్చించుకుంటున్నారు. అయితే రామ్ చరణ్ ఇటీవల పలు ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ పుట్టేది అమ్మాయే అన్నట్లు తెలుస్తోంది. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ (Interview) రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. “నా మొదటి జాన్ ఉపాసన. నా రెండవ జాన్ నా పెంపుడు కుక్క రైమ్.  నా 3వ జాన్ ఆమె త్వరలో వస్తుంది” అని చరణ్ వీడియోలో పేర్కొన్నాడు.

మాటల్లో మాటలో బిడ్డను ఉద్దేశిస్తూ రామ్ చరణ్ ‘హర్'(ఆమె) అన్నారు. కాబట్టి రామ్ చరణ్ అభిప్రాయంలో ఉపాసన అమ్మాయి జన్మనిస్తారని కొందరి వాదన. అలాగే ఇటీవల జరిగిన ఉపాసన సీమంతం ఫంక్షన్ డెకరేషన్ లో పింక్ హైలెట్ అయ్యింది. అదే థీమ్ లో వేదిక డెకరేట్ చేశారు. అలాగే ఉపాసన పింక్ కలర్ ఫ్రాక్ ధరించారు. పింక్ కలర్ (Pink Colour) గర్ల్ సింబల్. కాబట్టి ఇదొక హింట్ అంటున్నారు.

ఇక వారసత్వంగా చూసినా చిరంజీవి కుటుంబంలో ఎక్కువ మంది అమ్మాయిలు పుట్టారు. చిరంజీవి (Chiranjeevi)కి మొదటి సంతానం అమ్మాయి సుస్మిత. తర్వాత రామ్ చరణ్. మూడో సంతానం శ్రీజా. సుస్మితకు ఇద్దరూ అమ్మాయిలే అని సమాచారం. శ్రీజా కూడా ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చారు. ఆ విధంగా చూస్తే రామ్ చరణ్ కి కూడా మొదటి సంతానంగా అమ్మాయి పుట్టే ఛాన్స్ ఉందంటున్నారు.

Also Read: Priyanka Mohan: ప్రియాంక అందాలకు సుజిత్ క్లీన్ బోల్డ్.. ఓజీ ఆఫర్ అందుకేనా!

Exit mobile version