Ram Charan: కూతురు, భార్యతో ఎంజాయ్ చేస్తూ బీచ్ లో చిల్ అవుతున్న చెర్రీ. వీడియో వైరల్?

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే, మరొకవైపు తన ఫ్యామిలీ కోసం విలువైన సమయాన్ని గడుపుతూ క్షణం కూడా తీ

Published By: HashtagU Telugu Desk
Mixcollage 19 Mar 2024 10 35 Pm 107

Mixcollage 19 Mar 2024 10 35 Pm 107

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే, మరొకవైపు తన ఫ్యామిలీ కోసం విలువైన సమయాన్ని గడుపుతూ క్షణం కూడా తీరిక లేకుండా దొరుకుతున్నారు. కాగా చెర్రీ ఒకవైపు సినిమాలలో కనిపిస్తూనే తనకు సమయం దొరికినప్పుడల్లా కూతురు క్లీంకార అలాగే భార్య ఉపాసనతో కలిసి అలా వెకేషన్ కు వెళ్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. గత కొన్ని రోజులుగా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ షూటింగ్ తో వైజాగ్ లోనే ఉంటున్న సంగతి తెలిసిందే. దీంతో వైజాగ్ లో ఒక పక్క సముద్రం, మరో పక్క మెగా ఫ్యాన్స్ సంద్రం కనిపిస్తూ వచ్చింది.

నేటితో అక్కడి షూటింగ్ పూర్తి అయ్యింది. మళ్ళీ 21వ తారీఖు నుంచి హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ ని స్టార్ట్ చేయనున్నారు. ఇది ఇలా ఉంటే, చరణ్ సతీమణి ఉపాసన తన సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ వేశారు. ఆ పోస్టులో రామ్ చరణ్, ఉపాసన తమ కూతురు క్లీంకారతో కలిసి వైజాగ్ బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. మార్నింగ్ సన్‌రైజ్ ని చూస్తూ క్లీంకారతో పాటు చరణ్ కూడా చిన్నపిల్లాడిలా మారిపోయి ఆడుకున్నారు. ఈ వీడియో పోస్ట్ మెగా ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది.

 

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అంతేకాకుండా ఆ వీడియోలో క్లీంకార ఫేస్ కొంచెం కొంచెం కనిపించడం అన్నది మీరు గమనించవచ్చు. ఆ వీడియోని చూసినా అభిమానులు కొన్ని ఖుషి అవుతున్నారు. నిన్న మొన్నటి వరకు షూటింగ్ లో ఫుల్ బిజీ బిజీగా గడిపిన రామ్ చరణ్ కు కాస్త సమయం దొరకడంతో భార్య, కూతురితో కలిసి బీచ్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తూ చిల్ అవుతున్నారు.

  Last Updated: 19 Mar 2024, 10:37 PM IST